2018 సెప్టెంబర్ నెలలో నేను ఇటలీ, గ్రీసు, పోలండ్ దేశాలు పర్యటించాను. ఇటలీలో Pablo Neruda అవార్డును స్వీకరించి, గ్రీసుదేశంలో Indo Hellenistic Society మిత్రులను కలిసి ఏథెన్స్ నుంచి వార్సా (War. saw) చేరుకున్నాను. రఫాల్ జార్నికి, ఇజాబెల్ దంపతులు నన్ను వారింటికి ఆహ్వానించారు.
అక్కడ నుంచి పోలండ్ లోని ముఖ్యపట్టణాలలో Ryszard Grazek నేతృత్వంలో జరిగిన Poetry Festival లో ముఖ్య అతిధిగా పాల్గొన్నాను. అక్కడ నాలుగు పుస్తకాలు పోలండ్ కవిత్వం-తెలుగు అనువాదాలు ఆవిష్కరించ బడినాయి (పదిరంగుల ఇంద్రధనుస్సు, అంతరించిన దీపాల ప్రపంచం, క్షణాలు, తొలి వానజల్లు కురిసిన తరువాత నేల పరిమళం). పోలండ్లో నాకు అనేకమంది కవులు, కవయిత్రులు అత్యంత మిత్రులైనారు. వారిని ఇండియాకు ఆహ్వానించాను.
ఈ పుస్తకం 22 కవుల కవితల సమాహారం. ఇంగ్లీష్, తెలుగు భాషలలో వెలువడుతున్న ఈ కవిత్వ సంకలనం ఈనాటి పోలండ్ సాహిత్య వాతావరణాన్ని అన్ని కోణాల్లోనూ ప్రతిబింబిస్తుంది.
ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు సాహితీ లోకానికి అందించే యజ్ఞంలో భాగంగా వెలువడుతున్న ఈ పుస్తకాన్ని సాహితీ ప్రియులందరూ ఆదరిస్తారని సృజనలోకం గాఢంగా విశ్వసిస్తున్నది.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
2018 సెప్టెంబర్ నెలలో నేను ఇటలీ, గ్రీసు, పోలండ్ దేశాలు పర్యటించాను. ఇటలీలో Pablo Neruda అవార్డును స్వీకరించి, గ్రీసుదేశంలో Indo Hellenistic Society మిత్రులను కలిసి ఏథెన్స్ నుంచి వార్సా (War. saw) చేరుకున్నాను. రఫాల్ జార్నికి, ఇజాబెల్ దంపతులు నన్ను వారింటికి ఆహ్వానించారు. అక్కడ నుంచి పోలండ్ లోని ముఖ్యపట్టణాలలో Ryszard Grazek నేతృత్వంలో జరిగిన Poetry Festival లో ముఖ్య అతిధిగా పాల్గొన్నాను. అక్కడ నాలుగు పుస్తకాలు పోలండ్ కవిత్వం-తెలుగు అనువాదాలు ఆవిష్కరించ బడినాయి (పదిరంగుల ఇంద్రధనుస్సు, అంతరించిన దీపాల ప్రపంచం, క్షణాలు, తొలి వానజల్లు కురిసిన తరువాత నేల పరిమళం). పోలండ్లో నాకు అనేకమంది కవులు, కవయిత్రులు అత్యంత మిత్రులైనారు. వారిని ఇండియాకు ఆహ్వానించాను. ఈ పుస్తకం 22 కవుల కవితల సమాహారం. ఇంగ్లీష్, తెలుగు భాషలలో వెలువడుతున్న ఈ కవిత్వ సంకలనం ఈనాటి పోలండ్ సాహిత్య వాతావరణాన్ని అన్ని కోణాల్లోనూ ప్రతిబింబిస్తుంది. ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు సాహితీ లోకానికి అందించే యజ్ఞంలో భాగంగా వెలువడుతున్న ఈ పుస్తకాన్ని సాహితీ ప్రియులందరూ ఆదరిస్తారని సృజనలోకం గాఢంగా విశ్వసిస్తున్నది. - డాక్టర్ లంకా శివరామప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.