ముందుగా 'భూత' అన్న శబ్దానికి అర్ధము సమస్త ప్రాణులు అని - అర్ధము అందువలననే శివుని 'భూతనాధుడు' అంటారు. 'డామరు' అనగా భయపెట్టు నది లేక భయము కలిగించునది. భయపెట్టిది మంత్రామా? కాదు దుష్టులకు భయము శిష్టులకు రక్షణ కలిగించునది. తంత్రమునగా మంత్ర యంత్ర మైనది తంత్రము కలియుగములో సద్యః ప్రాప్తి పొందుటకు ఇష్టఫల ప్రాప్తికి తంత్రాత్మక మంత్రములు ఉపయోగపడును.
ఇందు భైరవ| భైరవీ సంభాషణా మాధ్యముగా కొన్ని - యక్షిణి, కిన్నరి యోగినీ సాధన మొదలగునవి చెప్పబడినవి వీని అనుష్ఠానము ద్వారా సాధకులు తప్పక సిద్ధులను సాధించగలరు. కానీ ఒక్క విషయము జ్ఞప్తియందుంచు కొనవలెను. గురువు లేక ఎట్టి జ్ఞానము సంపాదించుకోనలేము. ఏవిద్య యైననూ గురువు ద్వారానే సాధ్యము. అట్లే ఈ సాధనలు అనగా ముందు ముందు తెలుపు బోవునవి ఎవరికి వారు స్వయంముగా సాధించలేరు. సాధ్యము కాదు. కనుక సరియైన గురువు పర్వవేక్షణలో వారి శిక్షణలో వీటిని అనుష్ఠించి, సాధించి ప్రయోగించుకోనవలెను.
శాస్త్రములందు భైరవుని 8రకములుగా తెల్పిరి వీరిని 'అష్టభైరవులు' అందురు. అవి వరుసగా
© 2017,www.logili.com All Rights Reserved.