Kala Nidhi on 21.10.2018
ఇది రాయలసీమ ప్రజల జీవభాషలో రాసిన అద్భుత రచన. ఇది రచయిత జీవిత చరిత్రగా అనిపించినా టైటిల్ దగ్గర ట్యాగ్ గా "కనిపిస్తారు మీరూ ఒక చోట" అని చెప్పినట్లు దాదాపు సమాజంలో వంద సంవత్సరాల్లో వచ్చిన మార్పును కళ్లలు కట్టినట్లు ఎవరో మన ముందు కూర్చొని చెవిలో చెప్పినట్లు సరికొత్తగా చెప్పినాడు. గ్రామీణప్రజల్లో వ్యవహారంలో ఉన్న సహజ తెలుగుపదాలను ప్రతి ఒక్కరూ తమతమ ప్రాంతంలో వెదుక్కొనేలా చేశాడు. అన్ని ప్రాంతాలవారూ అన్ని వయస్సులవారూ ఈ రచన్లో ఏదో ఒకచోట తమను తాము చూసుకొనేలా అనుభవాల్తో తడిసిపోయేలా రాసిన ఈ రచన ఈ మధ్యవచ్చిన అత్యద్భుత పుస్తకాల్లో మొదటి కోవకు చెందినదని నా అభిప్రాయం.