Customer Reviews - Kavisena Manifesto


Average Rating :  :  


on 14.04.2016 2 0

*ఈనాడు కావలసింది... . సాహిత్య చైతన్యం *కవిత్వం బతుకు తెరువు కాదు .... జీవన విధానం *వచనంలో ఏది చెప్పాడనే దానికి స్దానమున్నట్లే కవిత్వంలో ఎట్లా చెప్పాడనే దానికే ప్రధాన స్థానం ఉంటుంది . *వర్తమాన తెలుగు మహా కవులు కవిత్వపు కల్తీ లేని స్వచ్చమయిన వచనమే రాస్తున్నారు . *ప్రతి కవితా ఎలా ఉండాలి ? ... .. చదివి పాఠకుడు చావాలి . కొత్త జన్మ ఎత్తాలి . *కవి నడుస్తున్న మానవతా సంక్షిప్త శబ్ద చిత్రం . - శేషేంద్ర * * * 1977లో వచ్చిన ఈ కావ్య శాస్త్రం , అప్పట్లో సాహిత్యంలో అన్ని వర్గాలనూ , అన్ని సంఘాలనూ తీవ్రమయిన ఆందోళనకు , మనస్తాపానికి గురి చేసింది . నిజం అంత ప్రమాదకరమయింది . నేటికీ తెలుగు కవిత్వంలో అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి . మరింత తీవ్ర రూపం దాల్చాయని చెప్పవచ్చు . కనుకనే కవిసేన కావ్య శాస్త్రం అన్నికాలాలకూ వర్తిస్తుంది . * * * ఒక కవి రాశిన ఆధునిక కావ్యశాస్త్ర్రం - తెలుగుదేశంలో నూతనంగా కవిత్వభోధ అభివ్యాప్తం చెయ్యడానికి ప్రయత్నించే గ్రంథం- అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిక పరిస్థితుల్లో ఆవిర్భవించిన ఒక ఉద్యమపత్రం. సామాన్య శబ్దానికి అసమాన్య ఆకర్షణ శక్తి ప్రదానం చేసి, దాన్ని మహత్తర పురోగమన సాధనంగా మార్చే అయస్కాంత విద్యను యువతరానికి నేర్పడానికి సాహిత్య సత్యాగ్రహయోద్ధల్ని మలచడానికి శబ్దరూపమెత్తిన కృషి- ప్రాచీన ప్రాక్ పశ్ఛిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్యతత్త్వ చింతన, మార్క్సిస్టు కావ్యతత్త్వ చింతనా అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీలించి ఆ నాల్గింటిలో ఉన్న ఆశ్చర్య జనక అభిన్నతనూ ఐకమత్యాన్ని ప్రతిపాదించి, ఈ విజ్ఞాన భారాన్నంతటినీ మోస్తేనే ఆధునిక మానవుడి విజ్ఞానానికి సమగ్రత వస్తుందని ప్రతిపాదిస్తుంది. శోకము ప్రీతి సత్త్వము సమాధి ఆది శబ్దాలకున్న అలంకారిక ప్రతిపత్తి - ప్రతిభ జన్మసంస్కారం కాదు, సమాధిగానీ విలక్షణ వ్యుత్పత్తిగానీ సాధించగల శక్తి అనే అలంకారిక మతము- కవే ప్రాచీన మత వాజ్ఞ్మయ కర్త- వాల్మీకి ప్రధమ ప్రజాకవి- వాల్మీకి ఉపమలు ప్రతీకలే- కవి శోకజ్వాలే కవిత్వంలో కమిట్మెంట్ ఇత్యాది నూతన విశేషాలు ఆవిష్కరిస్తుంది. * * * శేషేంద్ర సాహిత్య జగత్తును జీవిత విశేషాలను ఈ కింది హోం పేజి లో దర్శించండి . Seshendra : Visionary poet of the Millennium http://seshendrasharma.weebly.com ------------- KAVISENA MANIFESTO Seshendra Sharma – possibly the best known and most discussed modern Indian poet and thinker fulfils his dream of writing on four systems of thought on literature, namely The Ancient Indian Poetics, The Ancient Western Poetics, The Modern Western Poetics, and Marxist Poetics. This Manifesto as it is called remains one of the peaks of Seshendra’s achievement. It presents us with a full – length comparative studies of systems of East , West and Marxist poetic philosophy for which Seshendra has become famous. The manifesto is brilliant, makes very easy reading for students of literature and a valuable guide to those who teach poetics gives a comparative assessment of the science of poetics by one of the front rank intellectuals. Kavisena is an intellectual movement with a view to reshape the new minds to impart strength of truth to the younger developing generations. Manifesto, teaches them how to invest the magnetic power of poetry on the common word and turn literature into a weapon in the cause of change and progress. Possibly this is the first time in India that a poet lifted his pen to write poetics for his time and has brought his intelligence to bear on the lives and problems of his country.


Powered by infibeam