'ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం ఎప్పటికైనా తప్పదని అందరికీ తెలుసు. కానీ కొద్ది రోజుల్లో చనిపోతానని నిర్ధారణగా తెలిస్తే ఆ మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది? మామూలు మనుషుల సంగతేమో కాని ర్యాండీ పౌష్ మాత్రం సాహసవంతుడైన యోధుడిలా మృత్యువుతో పోరాడుతూనే తనకి జీవితం నేర్పిన పాఠాలని 'లాస్ట్ లెక్చర్' పేరుతో అందరికీ అందించాడు.. కేవలం అమెరికాలోనే 4.5 మిలియన్ల కాపీలు అమ్ముడైన ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా 46 భాషల్లోకి అనువాదం చేశారు. దీన్ని తెలుగులో అనువాదం చేసిన ప్రత్యేకత డాక్టర్ పోలంరెడ్డి శ్రీలక్ష్మి గారికి దక్కింది.. శ్రీలక్ష్మిగారు.. పుస్తకాన్ని అతి సరళమైన శైలిలో అనువాదం చేశారు. మూలానికి ఎక్కడా భంగం రాకుండా సూటిగా తెలుగులో వ్రాయబడిన పుస్తకాన్నే చదువుతున్నామన్న భావన కలిగించారు. శ్రీలక్ష్మిగారి ఈ ప్రయత్నాన్ని అందరం అభినందించి తీరాలి.. స్పూర్తి పొందడానికి తప్పనిసరిగా ఈ పుస్తకం చదవండి.'
'ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం ఎప్పటికైనా తప్పదని అందరికీ తెలుసు. కానీ కొద్ది రోజుల్లో చనిపోతానని నిర్ధారణగా తెలిస్తే ఆ మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది? మామూలు మనుషుల సంగతేమో కాని ర్యాండీ పౌష్ మాత్రం సాహసవంతుడైన యోధుడిలా మృత్యువుతో పోరాడుతూనే తనకి జీవితం నేర్పిన పాఠాలని 'లాస్ట్ లెక్చర్' పేరుతో అందరికీ అందించాడు.. కేవలం అమెరికాలోనే 4.5 మిలియన్ల కాపీలు అమ్ముడైన ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా 46 భాషల్లోకి అనువాదం చేశారు. దీన్ని తెలుగులో అనువాదం చేసిన ప్రత్యేకత డాక్టర్ పోలంరెడ్డి శ్రీలక్ష్మి గారికి దక్కింది.. శ్రీలక్ష్మిగారు.. పుస్తకాన్ని అతి సరళమైన శైలిలో అనువాదం చేశారు. మూలానికి ఎక్కడా భంగం రాకుండా సూటిగా తెలుగులో వ్రాయబడిన పుస్తకాన్నే చదువుతున్నామన్న భావన కలిగించారు. శ్రీలక్ష్మిగారి ఈ ప్రయత్నాన్ని అందరం అభినందించి తీరాలి.. స్పూర్తి పొందడానికి తప్పనిసరిగా ఈ పుస్తకం చదవండి.'© 2017,www.logili.com All Rights Reserved.