ప్రారంభానికి ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు.
ఆ సాయంత్రం జైలు ఆవరణలో ఖైదీలకి సిటీస్ ఎం.ఎం. ప్రొజెక్టర్, నర్తనశాల సినిమాని చూపిస్తున్నారు.
అంతా సినిమాని ఆసక్తిగా చూస్తున్నా ఇద్దరు మాత్రం ఆ సినిమాని చూడటంలేదు. పక్క పక్కనే కూర్చుని రహస్యంగా ఒకరితో మరొకరు గుసగుసలాడుకుంటున్నారు.
ఇద్దరిలో ఎక్కువ వయసున్న వ్యక్తి పేరు అంబాజీరావు. బేంక్ దోపిడీ నేరంమీద ఆయన శిక్షని అనుభవిస్తున్నాడు.
రెండో వ్యక్తి పేరు మునిస్వామి. అతను అమలాపురం నించి బయలుదేరిన ఓ లారీని తణుకు దగ్గర ఆపి అందులోని డ్రైవర్, క్లీనర్లని కొట్టి, కట్టేసి లారీలోని సరుకుని దోచుకున్న నేరానికి శిక్షపడి వచ్చి నాలుగు రోజులే ఐంది.
అంతకుమునుపు మునిస్వామి, అంబాజీరావు కలసి అదే జైల్లో రెండు, మూడుసార్లు శిక్ష అనుభవించారు. ఆ ముఖపరిచయంతో ఒకరికొకరు దగ్గరయ్యారు.
“ఇంపీరియల్ బేంక్ లో దొంగతనం చేయడం అంత తేలికా?” అంబాజీరావు అడిగాడు.
"అవును. అశోక్ నగర్ బ్రాంచ్ గురించి, అక్కడి ఉద్యోగస్తుల గురించి చాలా సమాచారం సేకరించాను. బేంక్ లో పనిచేసే ఉద్యోగస్తుల తల్లితండ్రులు, బంధువులు ఎవరు ఎక్కడెక్కడున్నారో వివరాలు నా దగ్గర ఉన్నాయి. మనం దొంగతనం చేద్దామనుకున్న రోజు బేంక్స్టాఫ్ తక్కువ మంది ఉండటానికి అనువుగా, ముందురోజు ముగ్గురు, నలుగురు |........
ప్రారంభానికి ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు. ఆ సాయంత్రం జైలు ఆవరణలో ఖైదీలకి సిటీస్ ఎం.ఎం. ప్రొజెక్టర్, నర్తనశాల సినిమాని చూపిస్తున్నారు. అంతా సినిమాని ఆసక్తిగా చూస్తున్నా ఇద్దరు మాత్రం ఆ సినిమాని చూడటంలేదు. పక్క పక్కనే కూర్చుని రహస్యంగా ఒకరితో మరొకరు గుసగుసలాడుకుంటున్నారు. ఇద్దరిలో ఎక్కువ వయసున్న వ్యక్తి పేరు అంబాజీరావు. బేంక్ దోపిడీ నేరంమీద ఆయన శిక్షని అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి పేరు మునిస్వామి. అతను అమలాపురం నించి బయలుదేరిన ఓ లారీని తణుకు దగ్గర ఆపి అందులోని డ్రైవర్, క్లీనర్లని కొట్టి, కట్టేసి లారీలోని సరుకుని దోచుకున్న నేరానికి శిక్షపడి వచ్చి నాలుగు రోజులే ఐంది. అంతకుమునుపు మునిస్వామి, అంబాజీరావు కలసి అదే జైల్లో రెండు, మూడుసార్లు శిక్ష అనుభవించారు. ఆ ముఖపరిచయంతో ఒకరికొకరు దగ్గరయ్యారు. “ఇంపీరియల్ బేంక్ లో దొంగతనం చేయడం అంత తేలికా?” అంబాజీరావు అడిగాడు. "అవును. అశోక్ నగర్ బ్రాంచ్ గురించి, అక్కడి ఉద్యోగస్తుల గురించి చాలా సమాచారం సేకరించాను. బేంక్ లో పనిచేసే ఉద్యోగస్తుల తల్లితండ్రులు, బంధువులు ఎవరు ఎక్కడెక్కడున్నారో వివరాలు నా దగ్గర ఉన్నాయి. మనం దొంగతనం చేద్దామనుకున్న రోజు బేంక్స్టాఫ్ తక్కువ మంది ఉండటానికి అనువుగా, ముందురోజు ముగ్గురు, నలుగురు |........© 2017,www.logili.com All Rights Reserved.