మేము కూడా మనుషులమే! చదువుకున్న యువకులు కూడా మమ్మల్ని అవమానకరంగా చూడడడం ఎంతో బాధ కలిగిస్తుంది. ఇలా పుట్టడం మేం చేసిన తప్పా? మా తల్లిదండ్రులు చేసిన తప్పా? దేవుడు మాకు ఎందుకు ఈ లోటు చేసాడు? జానెడు కడుపుకు ఆకలి పెట్టడంలో దేవుడు లోపం చేయలేదు. ఎవరు ఏ పని ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఏం చేయగలం? మా నేరం లేకుండానే ఎందుకు వేలి వేస్తున్నారు! సిగ్గు లేదు బరి తెగించారు అంటూ అపవాదులు వేస్తున్నారు. మా శరీర పుట్టుక వేరు. మా రూపం వేరు. మా లోపల ఆలోచనలు, మా ప్రవర్తన వేరు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియక తల్లడిలి పోతాము. తల్లిదండ్రులకు చెప్పలేము. తల్లిదండ్రులు కూడా ఆదరించరు.