ఉత్తరమున మహోన్నతంబయి
ఒప్పుచున్న హిమాలయం బడే,
పూర్వ పశ్చిమ దిశల నంటుచు
భువి కొకా నొక కొలత బద్దగ !
గగన గంగారురులు ఆ గిరి
కంఠమున వ్రేలాడుచుండును,
మేఘపంకులు దాటి శిఖరము
మింటి చుక్కల నంటుచుండును!
ఓషధులకును, రత్నములకును
ఉనికి పట్టది ఎంచి చూడగ;
వెలయు నా గిరి భరతభూమికి
వెల్లవేసిన కోట గోడగ!
తనను పోలిన కొండ లెవ్వియు
ధరణి లేవని విఱ్ఱ వీగుచు,
నవ్వుకొనుచున్నట్టు లా గిరి
నివ్వటిలు పెనుమంచు కాంతుల!.........
© 2017,www.logili.com All Rights Reserved.