విరాటపురం మహారాజు విచిత్రగుప్తుడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని హతం చేసే వ్యక్తి. మూర్ఖశిఖామణి! ఒకరోజు రాత్రి ఆయన ఉద్యానవనంలో సంచరిస్తున్నాడు. ఆకాశంలో వెన్నెల వెండి వర్షం కురిపిస్తున్నట్లుంది. చందమామను తదేకంగా చూసిన మహారాజుకు ఎంతో అసూయ కలిగింది. చంద్రుడు తనకంటే ఉన్నతుడిలా తోచాడు. తక్షణమే సూర్యుడు, నక్షత్రాలు కూడా తన తలపైనే ఉంటారనే విషయం జ్ఞప్తికి వచ్చింది. తన సింహాసనం కంటే ఎత్తులో వారుండడం అవమానంగా తోచింది ఆయనకు. మరుసటిరోజు సభలో మహామంత్రి మాధవవర్మతో 'మహా మంత్రీ! ఈ ప్రపంచంలో నాకంటే ఉన్నతులున్నారా?' అని ప్రశ్నించాడు. రాజు మొండితనం, మూర్ఖత్వం తెలిసిన వాడు కాబట్టి 'ఎవరూ లేరు ప్రభూ!' వినయంగా చెప్పాడు మాధవవర్మ.
విరాటపురం మహారాజు విచిత్రగుప్తుడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని హతం చేసే వ్యక్తి. మూర్ఖశిఖామణి! ఒకరోజు రాత్రి ఆయన ఉద్యానవనంలో సంచరిస్తున్నాడు. ఆకాశంలో వెన్నెల వెండి వర్షం కురిపిస్తున్నట్లుంది. చందమామను తదేకంగా చూసిన మహారాజుకు ఎంతో అసూయ కలిగింది. చంద్రుడు తనకంటే ఉన్నతుడిలా తోచాడు. తక్షణమే సూర్యుడు, నక్షత్రాలు కూడా తన తలపైనే ఉంటారనే విషయం జ్ఞప్తికి వచ్చింది. తన సింహాసనం కంటే ఎత్తులో వారుండడం అవమానంగా తోచింది ఆయనకు. మరుసటిరోజు సభలో మహామంత్రి మాధవవర్మతో 'మహా మంత్రీ! ఈ ప్రపంచంలో నాకంటే ఉన్నతులున్నారా?' అని ప్రశ్నించాడు. రాజు మొండితనం, మూర్ఖత్వం తెలిసిన వాడు కాబట్టి 'ఎవరూ లేరు ప్రభూ!' వినయంగా చెప్పాడు మాధవవర్మ.© 2017,www.logili.com All Rights Reserved.