ధరణీరుహ
“ఆది నుంచి ఈనాటి ఆధునిక మానవుని ప్రస్థానం వరకు ప్రకృతి కల్పవికల్పాలే పరిణామక్రమం. పరిశోధనలు, పరిశీలనలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిణామ క్రమంలో అవి సిద్ధాంతాలుగా మనగలుగుతాయేమోగానీ ఆ ప్రాకృతిక చలనశీల రహస్యం ఎప్పటికీ రహస్యమనే అనుకుంటాను... బహుశా అందుచేతనే అది తాత్విక చింతనా భూమిక అయింది. నిరంతర అన్వేషణలో మానవుడు చేస్తున్న ఒక అవిచ్చిన్న ప్రయత్న పూర్వక శోధన ఈ రహస్యాలను ఒక్కక్కొటిగా తెలుసుకునే పరిణితి మానవున్ని ఉచ్ఛ స్థితిలో ఉంచుతున్నది.
గత కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా ప్రకృతి సహజ ఎంపిక సూత్రాన్ని మానవుడు ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాడన్న విషయం మనకు అర్థం కానిది కాదు. కొంత చైతన్యవంతమైన సమూహాలు దీనిని కట్టడి చేయడం కొరకు సమాయాత్తమైనప్పటికి అది సరిపడినంతగా లేదు.
నేటి పరుగుల యుగంలో తనకూ ప్రకృతికి, ప్రకృతికి సంస్కృతికి, సంస్కృతికి నాగరికతకు ఉన్న సంబంధం వాటి మధ్య ఉన్న అవినాభావపు లంకెలు గుర్తించగలిగే తీరుబడి లేకపోవడం ఒక కారణమైతే ఒక అహగాహన కలిగించే రచనలు లేకపోవడం మరొక కారణం. సాహిత్యకారులు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ, పరిశోధకులు రహస్యాలను అన్వేషిస్తూ విడివిడిగా ప్రకృతిని ప్రతిపాదిస్తూ వచ్చారు. కానీ ఈ సున్నితమైన సంబంధాలు నిత్యం అదే ప్రకృతికి దగ్గరగా వుండేవాళ్లకు అనుభవైకమైనవి. వాటి నుంచి ఒక ప్రాకృతిక వారసత్వ వారధిని నిర్మించుకున్నప్పుడే నేటి మానవునికి సార్ధకత. అటువంటి వారధి నిర్మించడం వెనుక తెగిన సున్నితపు లంకెలను కలుపుకోవడం, జీవనైతిక నియమాలను పాటించడం ప్రత్యేకంగా చెప్పనవసరం లేని లక్ష్యాలు. ఆ లక్ష్యం కోసం చేసే అవిచ్చిన్న ప్రయత్నం ఈ 'అరణ్యం'లో ప్రయాణం....................
ధరణీరుహ “ఆది నుంచి ఈనాటి ఆధునిక మానవుని ప్రస్థానం వరకు ప్రకృతి కల్పవికల్పాలే పరిణామక్రమం. పరిశోధనలు, పరిశీలనలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిణామ క్రమంలో అవి సిద్ధాంతాలుగా మనగలుగుతాయేమోగానీ ఆ ప్రాకృతిక చలనశీల రహస్యం ఎప్పటికీ రహస్యమనే అనుకుంటాను... బహుశా అందుచేతనే అది తాత్విక చింతనా భూమిక అయింది. నిరంతర అన్వేషణలో మానవుడు చేస్తున్న ఒక అవిచ్చిన్న ప్రయత్న పూర్వక శోధన ఈ రహస్యాలను ఒక్కక్కొటిగా తెలుసుకునే పరిణితి మానవున్ని ఉచ్ఛ స్థితిలో ఉంచుతున్నది. గత కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా ప్రకృతి సహజ ఎంపిక సూత్రాన్ని మానవుడు ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాడన్న విషయం మనకు అర్థం కానిది కాదు. కొంత చైతన్యవంతమైన సమూహాలు దీనిని కట్టడి చేయడం కొరకు సమాయాత్తమైనప్పటికి అది సరిపడినంతగా లేదు. నేటి పరుగుల యుగంలో తనకూ ప్రకృతికి, ప్రకృతికి సంస్కృతికి, సంస్కృతికి నాగరికతకు ఉన్న సంబంధం వాటి మధ్య ఉన్న అవినాభావపు లంకెలు గుర్తించగలిగే తీరుబడి లేకపోవడం ఒక కారణమైతే ఒక అహగాహన కలిగించే రచనలు లేకపోవడం మరొక కారణం. సాహిత్యకారులు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ, పరిశోధకులు రహస్యాలను అన్వేషిస్తూ విడివిడిగా ప్రకృతిని ప్రతిపాదిస్తూ వచ్చారు. కానీ ఈ సున్నితమైన సంబంధాలు నిత్యం అదే ప్రకృతికి దగ్గరగా వుండేవాళ్లకు అనుభవైకమైనవి. వాటి నుంచి ఒక ప్రాకృతిక వారసత్వ వారధిని నిర్మించుకున్నప్పుడే నేటి మానవునికి సార్ధకత. అటువంటి వారధి నిర్మించడం వెనుక తెగిన సున్నితపు లంకెలను కలుపుకోవడం, జీవనైతిక నియమాలను పాటించడం ప్రత్యేకంగా చెప్పనవసరం లేని లక్ష్యాలు. ఆ లక్ష్యం కోసం చేసే అవిచ్చిన్న ప్రయత్నం ఈ 'అరణ్యం'లో ప్రయాణం....................© 2017,www.logili.com All Rights Reserved.