'టామ్ సాయర్' అనే పుస్తకం చదివివుంటే తప్ప నా గురించి మీకు తెలియదు. అయినా ఫరవాలేదులెండి. ఆ పుస్తకం మర్క్స్ ట్వైన్ అనే ఆయన రాశాడు. ఆయన రాసింది చాలామటుకు నిజమే. అక్కడక్కడ కొంచెం కల్పించి రాసినా, మొత్తంమీద ఆయన నిజమే రాశాడు. అదేమంత తప్పుకాదులెండి. ఓ సారి కాకపోతే, మరోసారైనా అబద్ధమంటూ చెప్పని వాడిని నేనింతవరకు చూడలేదు. అయితే, పోలీపెద్దమ్మ, డగ్లస్ అమ్మగారు, మేరీ మాత్రం ఎప్పుడూ అబద్ధం ఆడివుండకపోవచ్చు. ఈ ముగ్గురూ ఆ పుస్తకంలో - అంటే "టామ్ సాయర్" పుస్తకంలో వస్తారు. పోలీ పెద్దమ్మ అంటే టామ్ సాయర్ వాళ్ళ పెద్దమ్మ అన్నమాట. ఆ పుస్తకంలో అక్కడక్కడ కల్పన వున్నప్పటికీ చాలామటుకు నిజంగా జరిగిందే.
ఇంతకీ ఆ పుస్తకంలో చివరికి ఏం జరుగుతుందంటే టామ్ కీ, నాకూ గుహలో దొంగలు దాచిన బోలెడు డబ్బు దొరుకుతుంది. దాంతో మేము అమాంతంగా ధనవంతులమైపోయాము. మా ఇద్దరికీ చెరొక ఆరువేల డాలర్లూ వచ్చాయి. అది అంతా బంగారమే సుమండీ!
- నండూరి రామ మోహనరావు