1950వ సంవత్సరం నాటి కోన్ - టికీ సముద్రయాన కథలో పూర్వ కాలం నాటి పాలినేషియన్ సంస్కృతి మనకు గోచరమవుతున్నది. జన్మతః నార్వే దేశానికీ చెందిన థార్ హేయర్డ్ హల్ ప్రకృతి శాస్త్రాభిమాని. ఇతర పాలినేషయన్ల వలన విధానాన్ని మన దృష్టి పధానికి తెచ్చి అది ఒక సజీవ సత్యంగా నిరూపించాడు. భౌతిక శాస్త్రజ్ఞుడు కావటం చేత తాను చెప్పదలచుకున్న దానిని విశదంగా తెలియబరచాడు. తన సిద్ధాంతాన్ని ఋజువు పరచటం కోసం, సహచరులైదుగురిని ప్రోత్సహించి యాత్ర సాగించాడు. ఈ మహా కార్యం అతన్ని చిరస్మరణీయుడుగా చేస్తున్నది. ఈ యువకుల సాహసం వల్ల చరిత్ర కారులకు, భూగర్భ శాస్త్రజ్ఞులకు అయోమయంగా కనబడుతున్న ఒక అద్భుత సమస్య సమారిష్కృతమైనది. థార్ హేయర్డ్ హల మేకులు ఉపయోగించకుండా ఇంకాన్ జాతి వారి ప్రాచీన పద్దతిని తొమ్మిది బాల్స్ దంగుల తెప్పను నిర్మించి, దానినే సముద్రతరణ సాధనంగా చేసి, దానికి ఇంకాన్ జాతిలో ప్రాచీనుడైన కోన్ - టికీ పేరు పెట్టాడు.