Krishnarpanam

By Varigonda Kantarao (Author)
Rs.130
Rs.130

Krishnarpanam
INR
NAVOPH0637
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           చిన్న కథంటే, చిన్నగానే ఉండాలి, పరిమితులతో బాటు పరిపూర్ణత ఉండాలి. అన్నారు పాలగుమ్మి పద్మరాజు గారు 'కథానిక' గురించి మాట్లాడుతూ. ఈ నిర్వచనానికి తగ్గ కథానికలే ఈ సంపుటిలో ఉన్న వరిగొండ కాంతారావు గారి కథానికలు. ఈ సంపుటి 'కృష్ణార్పణం' లోని మొదటి చివరి కథానికలు శ్రీకృష్ణుడు, ఆయన భార్యల మీద వ్యంగ్యాస్త్రాలు, కృష్ణార్పణమన్నమాట.

            ఈ కథల సంపుటి "కృష్ణార్పణం" అధిక్షేప భావజాల, సున్నిత హాస్యచతురోక్తులతో వెలువడినది. ఇందులో రెండు కథలు పౌరాణిక పాత్రలనుజ్జీవనం గాను, మిగతా కథలు సాంఘిక నేపథ్యము కలవి. ఈ కహానీలు అన్ని మనసును ఆహ్లాదపరచడముతో పాటుగా, కాస్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. మరీ తీవ్రంగా మధిస్తే కొంత అలజడికి కూడా గురిచేస్తాయి. అందువలన ఆయన తానొవ్వక, ఇతరుల నొప్పించక అన్నట్టుగా సున్నితంగా, హాస్యంగా ఈ కథా బాణాలను సంధించాడు. అయినా తన సాహిత్యములో నేలవిడిచి సాము చేయలేదు ఏనాడూ! అది ఆయన సాహిత్య సృజనకు ప్రధాన ఆలంబనగా ఉండినది.

            వరంగల్ ప్రాంత మాండలికం, కోస్తా భాషలలో మధ్య తరగతి జీవితాల బాధలను కళ్ళముందుంచుతాయి ఈ కథానికలు. తరిగిపోతున్న మానవతా విలువల్ని మన ముందుంచుతాయి. శాశ్వత విలువల నేపథ్యంలో మారుతున్న విలువల్ని చెబితే ఈ మార్పులకి కారణం ఒక్కటే - శాశ్వత విలువలు మానవతా విలువలు తగ్గిపోవడమే అని జవాబు లభిస్తుంది. అందరూ తప్పక చదవాల్సిన కథానికలు. చదివి జ్ఞాపకముంచుకొని జీవితాల్ని మలచుకోవాలి. రచయిత అభినందనీయులు.

                                     - డా వేదగిరి రాంబాబు గారు

               

           చిన్న కథంటే, చిన్నగానే ఉండాలి, పరిమితులతో బాటు పరిపూర్ణత ఉండాలి. అన్నారు పాలగుమ్మి పద్మరాజు గారు 'కథానిక' గురించి మాట్లాడుతూ. ఈ నిర్వచనానికి తగ్గ కథానికలే ఈ సంపుటిలో ఉన్న వరిగొండ కాంతారావు గారి కథానికలు. ఈ సంపుటి 'కృష్ణార్పణం' లోని మొదటి చివరి కథానికలు శ్రీకృష్ణుడు, ఆయన భార్యల మీద వ్యంగ్యాస్త్రాలు, కృష్ణార్పణమన్నమాట.             ఈ కథల సంపుటి "కృష్ణార్పణం" అధిక్షేప భావజాల, సున్నిత హాస్యచతురోక్తులతో వెలువడినది. ఇందులో రెండు కథలు పౌరాణిక పాత్రలనుజ్జీవనం గాను, మిగతా కథలు సాంఘిక నేపథ్యము కలవి. ఈ కహానీలు అన్ని మనసును ఆహ్లాదపరచడముతో పాటుగా, కాస్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. మరీ తీవ్రంగా మధిస్తే కొంత అలజడికి కూడా గురిచేస్తాయి. అందువలన ఆయన తానొవ్వక, ఇతరుల నొప్పించక అన్నట్టుగా సున్నితంగా, హాస్యంగా ఈ కథా బాణాలను సంధించాడు. అయినా తన సాహిత్యములో నేలవిడిచి సాము చేయలేదు ఏనాడూ! అది ఆయన సాహిత్య సృజనకు ప్రధాన ఆలంబనగా ఉండినది.             వరంగల్ ప్రాంత మాండలికం, కోస్తా భాషలలో మధ్య తరగతి జీవితాల బాధలను కళ్ళముందుంచుతాయి ఈ కథానికలు. తరిగిపోతున్న మానవతా విలువల్ని మన ముందుంచుతాయి. శాశ్వత విలువల నేపథ్యంలో మారుతున్న విలువల్ని చెబితే ఈ మార్పులకి కారణం ఒక్కటే - శాశ్వత విలువలు మానవతా విలువలు తగ్గిపోవడమే అని జవాబు లభిస్తుంది. అందరూ తప్పక చదవాల్సిన కథానికలు. చదివి జ్ఞాపకముంచుకొని జీవితాల్ని మలచుకోవాలి. రచయిత అభినందనీయులు.                                      - డా వేదగిరి రాంబాబు గారు                

Features

  • : Krishnarpanam
  • : Varigonda Kantarao
  • : Navodaya Book House
  • : NAVOPH0637
  • : Paperback
  • : 2016
  • : 140
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Krishnarpanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam