నిజాన్ని నిర్భయంగా చెప్పటానికి మాటల్లో చెప్పేంత ధైర్యం సరిపోదు. ఒక వేళ అంత ధైర్యం తో ప్రతీ నిజాన్నీ బైట పెట్టినా సమాజం పొడిచే సూదుల్లాంటి కసురులను పట్టించుకోకుండా ఉండటం కత్తి మీద సాము లాంటిదే. యదార్థ వాదే లోక విరోధి అన్నట్టుగా సాగే మన సమాజంలో ఒక కవయిత్రి ఎదుర్కొనే సమస్యల గురించి విదితమే. కాని నిప్పుని సైతం గుప్పెట్లో పట్టి చలించకుండా ఉండగలిగే తెగువ కల మహిళా నాకు స్నేహితురాలు కావటం తన గురించి నేను రాయటం నా అదృష్టం. తప్పు చేసిన వాడు తండ్రైనా దండించాలనుకుంటుంది. మంచి చేసిన వాడు శత్రువైనా అభినందిస్తుంది. ఔషధం రుచి దుర్లభం అన్నట్టు, తన తీరు చూడటానికి పొగరుగా కటువుగా అనిపిస్తుంది. కాని మనసు పొరల్లోకి తొంగి చూస్తే తనలో దాగిన పసి ప్రాణం బైట పడుతుంది. తెలుపు లోనే అన్ని రంగులూ ఓదిగినట్టు, తనలోని ఎన్నో భావ వర్ణాలు తెగువ అనే ధవళ వర్ణంతో కప్పబడి ఉంటాయి. ఈ అభిలాష కవిత్వానికి పర్యాయపదంగా కీర్తింపబడాలని నా అభిలాష!!
- రోజా కొమరవోలు
నిజాన్ని నిర్భయంగా చెప్పటానికి మాటల్లో చెప్పేంత ధైర్యం సరిపోదు. ఒక వేళ అంత ధైర్యం తో ప్రతీ నిజాన్నీ బైట పెట్టినా సమాజం పొడిచే సూదుల్లాంటి కసురులను పట్టించుకోకుండా ఉండటం కత్తి మీద సాము లాంటిదే. యదార్థ వాదే లోక విరోధి అన్నట్టుగా సాగే మన సమాజంలో ఒక కవయిత్రి ఎదుర్కొనే సమస్యల గురించి విదితమే. కాని నిప్పుని సైతం గుప్పెట్లో పట్టి చలించకుండా ఉండగలిగే తెగువ కల మహిళా నాకు స్నేహితురాలు కావటం తన గురించి నేను రాయటం నా అదృష్టం. తప్పు చేసిన వాడు తండ్రైనా దండించాలనుకుంటుంది. మంచి చేసిన వాడు శత్రువైనా అభినందిస్తుంది. ఔషధం రుచి దుర్లభం అన్నట్టు, తన తీరు చూడటానికి పొగరుగా కటువుగా అనిపిస్తుంది. కాని మనసు పొరల్లోకి తొంగి చూస్తే తనలో దాగిన పసి ప్రాణం బైట పడుతుంది. తెలుపు లోనే అన్ని రంగులూ ఓదిగినట్టు, తనలోని ఎన్నో భావ వర్ణాలు తెగువ అనే ధవళ వర్ణంతో కప్పబడి ఉంటాయి. ఈ అభిలాష కవిత్వానికి పర్యాయపదంగా కీర్తింపబడాలని నా అభిలాష!! - రోజా కొమరవోలు© 2017,www.logili.com All Rights Reserved.