మనవి
చదువరులు అందరికీ వందనాలు. 'మల్లవరపు వెలువరింతలు' నుంచి వసు మూడవ కతలపొత్తం ఇది. మేము ఇంతకుముందు వెలువరించిన సిలువగుడి కతలు కతలగంప అనే పొత్తాలు, చదువరుల మన్ననలను అందుకొన్నయి. మూడవ పోతం తేవాలని అనుకొన్నప్పుడు, నడుస్తున్న చరిత్రలో వచ్చిన 'చెంచు బతుకు కతలు' మాకు గుర్తుకు వచ్చినయి. మాకందరికీ ఎంతో నచ్చి, మమ్మల్ని ఎంతో కదిలించిన కతలవి. వాటినే ఒక పొత్తంగా తెద్దామనుకొన్నము. ఎందుకనో ఆ కతలను వ్రాసిన వారు ఒప్పుకోలేదు. మాకు కాస్త నిరాశ కలిగింది. అప్పుడు తమ్ముడు స.వెం. రమేశ ను అడిగితే తనే ఈ ఆలోచనను మా ముందు ఉంచిండు.
ప్రతి ఇద్దరి తెలుగువారిలో ఒకరు, తెలంగాణాంధ్రలకు బయటే ఉన్నారు. తొమ్మిది కోట్ల మందిగా ఉండే ఆ తెలుగు బతుకులూ కతలూ బయటకు రావాలని తమ్ముడు అన్నప్పుడు అతని మాట నిజమే అనిపించింది. వెంటనే పనిలోకి దిగినం. కతలను సేకరించుడు, ఎంపిక చేసుడు అనే మొత్తం పనిని తమ్ముడే చూసిండు. మిత్రులు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, అడపాల సుబ్బారెడ్డి, మార్టూరి సంజాన పద్మంలు పనిలో పాలుపంచుకొన్నారు.
నెల్లూరులో ఉంటున్న మా చెల్లెలు బుర్లా సుపర్ల, పొత్తంవెలువరింతకు అవసరమైన మొత్తాన్ని అందించింది. వీరందిరికి మప్పిదాలు. చరిత్రలో నిలబడిపోయే ఇటువంటి పనులకు నాకు అండదండగా ఉంటున్న మావారు మల్లవరపు విజయ మరియదాసు గారికీ, కొడుకులు విక్రమాదిత్య, విజయాదిత్యలకూ కూడా ప్పిదాలు. - ఆ తొలి రెండు పొత్తాలలాగనే ఇది కూడా మీకు నచ్చుతుందని మా నమ్మకం. మీరిచ్చే ప్రోత్సాహమే మా బలం. ఆబలంతపొత్తాలను అందించగల మని మనవి చేస్తూ...
© 2017,www.logili.com All Rights Reserved.