ప్రేమ కథలా? ఇప్పుడెందుకు? అని మీరు అడగొచ్చు. ఇప్పుడే ఇలాంటి ప్రేమ కథల సంకలనం అత్యవసరం అని మాకనిపించింది.
ఈ ప్రేమ కథల పుస్తకం హఠాత్తుగా ఒక సాయంత్రం ఆలోచన వచ్చి ప్రచురించింది కాదు. ఆ ఆలోచనకు కనీసం మూడేళ్ళ వయసుంది.
తెలుగు లో రచయితలం కొందరం, కాస్త సీరియస్ గా రాస్తున్నాం అనే అవగాహన వచ్చేసరికి మా రచనలు చదివే చదువరులు తగ్గిపోయారనే విషయం అర్థమైంది. అసలు ఎందుకు రీడర్స్ సరిపడలేరు అనే ప్రశ్న సాహిత్యకారులు గత ఇరవయ్యేళ్ళుగా వేధిస్తూనే ఉంది. దృశ్య మాధ్యమం, ఇంటర్నెట్, ఇంగ్లీష్ మీడియం చదువు - ఇలా కొన్ని కారణాలు పైకి కనిపించినా, ఇవి ఏవీ అసలు కారణాలు కాదు.
ఎందుకంటే, ఇప్పటికీ ఇంగ్లీషు పుస్తకాలు మార్కెట్లో బాగానే అమ్ముడవుతున్నాయి. తెలుగులో అలాంటి వాతావరణం లేదు. కాస్త ఆలోచించాక అర్థమైందేటంటే, మన తెలుగులో సాహిత్యానికి పరిచయం చేసే ఎంట్రీపాయింట్ ఎక్కడో తెగిపోయింది.
- అపర్ణ తోట, వెంకట్ శిద్దారెడ్డి