ఈ కథలు భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యానంతర రెండవదశకు చెందినవి. అంటే అత్యవసర పరిస్థితి చీకటి రోజుల తర్వాతి కాలానికి చెందినవి. స్వాతంత్ర్యానంతర రెండవదశలో భారతదేశంలో రాజకీయంగా చాలా చాలా పరిణామాలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీల సుడిగాలి వీచింది. అణగారిన వర్గాల ప్రజల, కుల, మత, జండర్, ప్రాంత, భాషా చైతన్యాలు పెల్లుబికాయి.
ఆధిపత్యధోరణి కూడా తక్కువ తినలేదు. రాజకీయ అస్థిరత పెరిగింది. ఏవేవో రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నా సామాజిక సమస్యలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. పాలకులు మారుతున్నా, నినాదాలు, విధానాలు మారుతున్నా సమస్యలు సమస్యలు గానే కొనసాగుతున్నాయి. కుర్చీలలో కూర్చునేవాళ్ళు మారుతున్నారుగాని, కుర్చీ స్వభావం మారలేదు. పునాదిలో మార్పులేని రాజ్యస్వభావం ఇలాగే ఉంటుంది. ఈ రాజ్య స్వభావాన్నే హయాత్ తన కథల్లో చిత్రించారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థలనే మూల స్తంభాల కింద నలిగిపోతున్న మనుషుల బతుకుల చిత్రాలు హయాత్ కథలు..
ఈ కథలు భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యానంతర రెండవదశకు చెందినవి. అంటే అత్యవసర పరిస్థితి చీకటి రోజుల తర్వాతి కాలానికి చెందినవి. స్వాతంత్ర్యానంతర రెండవదశలో భారతదేశంలో రాజకీయంగా చాలా చాలా పరిణామాలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీల సుడిగాలి వీచింది. అణగారిన వర్గాల ప్రజల, కుల, మత, జండర్, ప్రాంత, భాషా చైతన్యాలు పెల్లుబికాయి. ఆధిపత్యధోరణి కూడా తక్కువ తినలేదు. రాజకీయ అస్థిరత పెరిగింది. ఏవేవో రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నా సామాజిక సమస్యలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. పాలకులు మారుతున్నా, నినాదాలు, విధానాలు మారుతున్నా సమస్యలు సమస్యలు గానే కొనసాగుతున్నాయి. కుర్చీలలో కూర్చునేవాళ్ళు మారుతున్నారుగాని, కుర్చీ స్వభావం మారలేదు. పునాదిలో మార్పులేని రాజ్యస్వభావం ఇలాగే ఉంటుంది. ఈ రాజ్య స్వభావాన్నే హయాత్ తన కథల్లో చిత్రించారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థలనే మూల స్తంభాల కింద నలిగిపోతున్న మనుషుల బతుకుల చిత్రాలు హయాత్ కథలు..© 2017,www.logili.com All Rights Reserved.