నిత్యజీవితంలో అనునిత్యం ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలని మంచి మంచి కథలుగా మలచగల నేర్పరి సుందరీ నాగమణి. ఈ సంపుటిలో ఇరవై రెండు కథల్లోనూ, ఒక్క 'హృదయ మధనం' తప్ప, మనకి ఎదురయ్యే పాత్రలన్నీ పాఠకులని ఎక్కడో అక్కడ పలకరించే ఉంటాయి. ఎవరిదైనా చేతిరాత బాగా లేకపోతే ఏం చేస్తాం? మామూలుగా తిట్టుకుని ఊరుకుంటాం. అదే సరదా అయిన కథగా మలచగల నేర్పు నాగమణిది. ఏ కథావస్తువు తీసుకున్నా పాఠకుల మనసులకు హత్తుకుపోయేలా తీర్చిదిద్దగలరు రచయిత్రి.
'హృదయ మధనం' రాధామాధవుల గాథ. అందరూ విన్నదానికి విభిన్నంగా ఆగిపోయిన దగ్గరనుంచి ఆరంభమై కొనసాగుతుంది. చాలా చిన్న సమస్యలనుకున్న, సాధారణంగా ఎవరూ పట్టించుకోని, చికాకు కలిగించే సంగతులు ఇక్కడ కథావస్తువులు. ఇవి నిజజీవితంలో ఇంత ఇబ్బంది కలిగిస్తాయా అని ఆశ్చర్యపోతారు చదువరులు. ఆహార నియంత్రణ లేకపోతే వచ్చే ఇబ్బందులు సరదాగా, నడత అదుపులో లేకపోతే కలిగే విషాద పరిణామాలు ఒక పాఠం లా నడుస్తాయి రెండు కథలు. అలా ఈ పుస్తకంలో మరెన్నో కధలు కలవు.
నిత్యజీవితంలో అనునిత్యం ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలని మంచి మంచి కథలుగా మలచగల నేర్పరి సుందరీ నాగమణి. ఈ సంపుటిలో ఇరవై రెండు కథల్లోనూ, ఒక్క 'హృదయ మధనం' తప్ప, మనకి ఎదురయ్యే పాత్రలన్నీ పాఠకులని ఎక్కడో అక్కడ పలకరించే ఉంటాయి. ఎవరిదైనా చేతిరాత బాగా లేకపోతే ఏం చేస్తాం? మామూలుగా తిట్టుకుని ఊరుకుంటాం. అదే సరదా అయిన కథగా మలచగల నేర్పు నాగమణిది. ఏ కథావస్తువు తీసుకున్నా పాఠకుల మనసులకు హత్తుకుపోయేలా తీర్చిదిద్దగలరు రచయిత్రి. 'హృదయ మధనం' రాధామాధవుల గాథ. అందరూ విన్నదానికి విభిన్నంగా ఆగిపోయిన దగ్గరనుంచి ఆరంభమై కొనసాగుతుంది. చాలా చిన్న సమస్యలనుకున్న, సాధారణంగా ఎవరూ పట్టించుకోని, చికాకు కలిగించే సంగతులు ఇక్కడ కథావస్తువులు. ఇవి నిజజీవితంలో ఇంత ఇబ్బంది కలిగిస్తాయా అని ఆశ్చర్యపోతారు చదువరులు. ఆహార నియంత్రణ లేకపోతే వచ్చే ఇబ్బందులు సరదాగా, నడత అదుపులో లేకపోతే కలిగే విషాద పరిణామాలు ఒక పాఠం లా నడుస్తాయి రెండు కథలు. అలా ఈ పుస్తకంలో మరెన్నో కధలు కలవు.© 2017,www.logili.com All Rights Reserved.