సంస్కారవంతమైన కథలు
తెలుగులో మంచి కథలు వ్రాసినవారు, వ్రాస్తున్నవారు చాలామంది ఉన్నారు. వారందర్నీ పేర్కొనడానికి ఇది సందర్భం కాదు. అయితే, వస్తువులో కానీ, శిల్పంలో కానీ ఒక క్రొత్తదనాన్ని, క్రొత్త ఒరవడిని తమ సాహిత్యంలో ప్రవేశపెట్టిన వారు నాకు తెలిసి కొంతమంది మాత్రమే ఉన్నారు. వారి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తున్న వర్ధమాన రచయిత్రి శ్రీమతి గోళ్ళమూడి కిరణ్మయి. శిల్పానికి, క్లుప్తతకీ, వస్తు వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తారు ఈ రచయిత్రి.
కథలు వ్రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు! అందులోనూ చిన్న కథా రచన కత్తి మీద సాము లాంటిది. తనకు లభ్యమైన కాన్వాస్ చిన్నదని గుర్తించుకోవాలి రచయిత/రచయిత్రి. తూకం వేసినట్టుగా భావవ్యక్తీకరణ ఉండాలి; భాషలో పొదుపు పాటించాలి. అల్లికలో ప్రతిభ కనబరిచాలి. తాను చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పక పోయినా వస్తువు పాఠకులకు సంపూర్ణంగా అవగతమయ్యేలా ఉండాలి.
ఈ రచయిత్రి చిన్ని కథలు సమర్థవంతంగా అల్లడంలో దిట్ట! అందుకే, 'ఎమ్మెస్వీ' యూనివర్సిటీ నుండి పీ.హెచ్ డీ పట్టా అలవోకగా కొట్టేసి ప్రొఫెసర్గా అల రారుతున్నారు.
ఈ రచయిత్రి కథలు గూర్చి చెప్పే ముందు నాకు తెలిసిన ఈ కిరణ్మయిగారి గూర్చి నాలుగుమాటలు చెప్పడం విధాయకం అనిపిస్తోంది. ఈవిడ బాధ్యతాయుతమైన ఒక బ్యాంకు అధికారిణి. సంస్కారవంతమైన స్త్రీమూర్తి. నడవడికలో ఎటువంటి తిక మకలూ లేని వ్యక్తి. రాజ్యాంగబద్ధంగా తనకు సంప్రాప్తించిన ప్రాథమిక హక్కులతో బాటు, నైతికంగా తాను ఆచరించవలసిన బాధ్యతలను కూడా సర్వవేళలా గుర్తుంచు కుని చరియించే బాధ్యతాయుతమైన ఒక భారతీయ మహిళ. విలువలతో కూడిన వ్యక్తిత్వం కలవారు కనుకనే, ఎక్కడో దూరాన వంగ రాష్ట్రంలో ఉద్యోగం చేసినా తన సహోద్యోగులచే మాత్రమే కాదు. ఆ ప్రదేశ ప్రజలచే కూడా జేజేలు పలికించుకుని.............
సంస్కారవంతమైన కథలు తెలుగులో మంచి కథలు వ్రాసినవారు, వ్రాస్తున్నవారు చాలామంది ఉన్నారు. వారందర్నీ పేర్కొనడానికి ఇది సందర్భం కాదు. అయితే, వస్తువులో కానీ, శిల్పంలో కానీ ఒక క్రొత్తదనాన్ని, క్రొత్త ఒరవడిని తమ సాహిత్యంలో ప్రవేశపెట్టిన వారు నాకు తెలిసి కొంతమంది మాత్రమే ఉన్నారు. వారి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తున్న వర్ధమాన రచయిత్రి శ్రీమతి గోళ్ళమూడి కిరణ్మయి. శిల్పానికి, క్లుప్తతకీ, వస్తు వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తారు ఈ రచయిత్రి. కథలు వ్రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు! అందులోనూ చిన్న కథా రచన కత్తి మీద సాము లాంటిది. తనకు లభ్యమైన కాన్వాస్ చిన్నదని గుర్తించుకోవాలి రచయిత/రచయిత్రి. తూకం వేసినట్టుగా భావవ్యక్తీకరణ ఉండాలి; భాషలో పొదుపు పాటించాలి. అల్లికలో ప్రతిభ కనబరిచాలి. తాను చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పక పోయినా వస్తువు పాఠకులకు సంపూర్ణంగా అవగతమయ్యేలా ఉండాలి. ఈ రచయిత్రి చిన్ని కథలు సమర్థవంతంగా అల్లడంలో దిట్ట! అందుకే, 'ఎమ్మెస్వీ' యూనివర్సిటీ నుండి పీ.హెచ్ డీ పట్టా అలవోకగా కొట్టేసి ప్రొఫెసర్గా అల రారుతున్నారు. ఈ రచయిత్రి కథలు గూర్చి చెప్పే ముందు నాకు తెలిసిన ఈ కిరణ్మయిగారి గూర్చి నాలుగుమాటలు చెప్పడం విధాయకం అనిపిస్తోంది. ఈవిడ బాధ్యతాయుతమైన ఒక బ్యాంకు అధికారిణి. సంస్కారవంతమైన స్త్రీమూర్తి. నడవడికలో ఎటువంటి తిక మకలూ లేని వ్యక్తి. రాజ్యాంగబద్ధంగా తనకు సంప్రాప్తించిన ప్రాథమిక హక్కులతో బాటు, నైతికంగా తాను ఆచరించవలసిన బాధ్యతలను కూడా సర్వవేళలా గుర్తుంచు కుని చరియించే బాధ్యతాయుతమైన ఒక భారతీయ మహిళ. విలువలతో కూడిన వ్యక్తిత్వం కలవారు కనుకనే, ఎక్కడో దూరాన వంగ రాష్ట్రంలో ఉద్యోగం చేసినా తన సహోద్యోగులచే మాత్రమే కాదు. ఆ ప్రదేశ ప్రజలచే కూడా జేజేలు పలికించుకుని.............© 2017,www.logili.com All Rights Reserved.