171వ నంబరు రైలు స్టేషను సమీపంలో ఓ డజను యిళ్లూ, ఓ ఫైరింజను షెడూ, యీ శతాబ్దారంభంలో చక్కగా మలిచిన గోడరాళ్లతో నేలబారుగా పొడుగ్గా కట్టిన ఓ గిడ్డంగీ యింకా కూలిపోకుండా నిలిచివున్నాయి. గత విమానదాడిలో మంచినీళ్ల టవర్ టాంకు కాస్తా కూలిపోయింది రైలుబళిక యిక్కడ ఆగడం లేదు. జర్నర్షిప్పుడు బాంబుదాడులు జరపనిమాట నిజమే అయినా, వాళ్ల విమానాలు ఏ రోజూ స్టేషను పైగా ఎగురుతూనే వున్నాయి, కాగా సోవియట్ సైనిక అధికారులు ముందుజాగ్రత్త కోసం నాలుగు బారుల విమాన విధ్వంసక శతఘ్నులు రెండింటిని సర్వ సంసిద్ధంగా అమర్చి వుంచారు.
అది 1942 మే మాసం. పడమటి దిక్కున (అక్కడినుండి ఫిరంగి గర్జనల ఘోష తేమగా వున్న రాత్రి వేళల్లో స్పష్టంగా వినవస్తోంది) యిరు పక్షాలూ కందకాలలో గట్టి రక్షణ స్థావరాలు ఏర్పాటుచేసుకొని నిలకడగా యుద్ధం సాగిస్తున్నాయి; తూర్పున జర్మన్లు కాలువ పైనా, మూర్మ, రైలుదారి పైనా రాత్రింబగళ్లు ఎడతెరిపి లేకుండా బాంబులు కురిపిస్తున్నారు. ఉత్తరాన సముద్ర మార్గాల కోసం ఘోరమైన పోరు సాగుతోంది. దక్షిణాన జర్మన్ల ముట్టడిలో వున్న లెనిన్ గ్రాడ్ తీవ్రమైన ప్రతిఘటనను నిబ్బరంగా సాగిస్తోంది.
కాని యిక్కడంటారా యిదొక విశ్రాంతి కేంద్రంలా వుంది. ప్రశాంత పరిసరాలకు సోమరితనం తోడై ఆవిరిస్నానం మాదిరిగా సైనికులను మెత్తబరచి అలసులను చేసింది. బాంబు దాడులకు నాశనం కాగా మిగిలిన ఆ డజను యిళ్లలోనూ దేనితోనైనా సరే, చివరకు శూన్యంలోంచి సైతం నాటు సారాను వాటంగా తయారుచెయ్యగల బోలెడుమంది యువతులు, వితంతువులూ యింకా వున్నారు.
మొదటి మూడు రోజులూ కొత్త శతఘ్ని సిబ్బంది కంటినిండా కరువుదీర నిద్రపోతారు, పరిసర పరిస్థితులను చక్కగా ఆకళించుకుంటారు. నాలుగో రోజున వాళ్లలో ఎవరో ఒకరి నామకరణోత్సవం ప్రారంభమవుతుంది, దానితో యిక చూసుకోండి నాటుసారా | ఘాటు కంపు స్టేషనంతటినీ కమ్మేసి, యిక ఓ పట్టాన వదలదు..............
171వ నంబరు రైలు స్టేషను సమీపంలో ఓ డజను యిళ్లూ, ఓ ఫైరింజను షెడూ, యీ శతాబ్దారంభంలో చక్కగా మలిచిన గోడరాళ్లతో నేలబారుగా పొడుగ్గా కట్టిన ఓ గిడ్డంగీ యింకా కూలిపోకుండా నిలిచివున్నాయి. గత విమానదాడిలో మంచినీళ్ల టవర్ టాంకు కాస్తా కూలిపోయింది రైలుబళిక యిక్కడ ఆగడం లేదు. జర్నర్షిప్పుడు బాంబుదాడులు జరపనిమాట నిజమే అయినా, వాళ్ల విమానాలు ఏ రోజూ స్టేషను పైగా ఎగురుతూనే వున్నాయి, కాగా సోవియట్ సైనిక అధికారులు ముందుజాగ్రత్త కోసం నాలుగు బారుల విమాన విధ్వంసక శతఘ్నులు రెండింటిని సర్వ సంసిద్ధంగా అమర్చి వుంచారు. అది 1942 మే మాసం. పడమటి దిక్కున (అక్కడినుండి ఫిరంగి గర్జనల ఘోష తేమగా వున్న రాత్రి వేళల్లో స్పష్టంగా వినవస్తోంది) యిరు పక్షాలూ కందకాలలో గట్టి రక్షణ స్థావరాలు ఏర్పాటుచేసుకొని నిలకడగా యుద్ధం సాగిస్తున్నాయి; తూర్పున జర్మన్లు కాలువ పైనా, మూర్మ, రైలుదారి పైనా రాత్రింబగళ్లు ఎడతెరిపి లేకుండా బాంబులు కురిపిస్తున్నారు. ఉత్తరాన సముద్ర మార్గాల కోసం ఘోరమైన పోరు సాగుతోంది. దక్షిణాన జర్మన్ల ముట్టడిలో వున్న లెనిన్ గ్రాడ్ తీవ్రమైన ప్రతిఘటనను నిబ్బరంగా సాగిస్తోంది. కాని యిక్కడంటారా యిదొక విశ్రాంతి కేంద్రంలా వుంది. ప్రశాంత పరిసరాలకు సోమరితనం తోడై ఆవిరిస్నానం మాదిరిగా సైనికులను మెత్తబరచి అలసులను చేసింది. బాంబు దాడులకు నాశనం కాగా మిగిలిన ఆ డజను యిళ్లలోనూ దేనితోనైనా సరే, చివరకు శూన్యంలోంచి సైతం నాటు సారాను వాటంగా తయారుచెయ్యగల బోలెడుమంది యువతులు, వితంతువులూ యింకా వున్నారు. మొదటి మూడు రోజులూ కొత్త శతఘ్ని సిబ్బంది కంటినిండా కరువుదీర నిద్రపోతారు, పరిసర పరిస్థితులను చక్కగా ఆకళించుకుంటారు. నాలుగో రోజున వాళ్లలో ఎవరో ఒకరి నామకరణోత్సవం ప్రారంభమవుతుంది, దానితో యిక చూసుకోండి నాటుసారా | ఘాటు కంపు స్టేషనంతటినీ కమ్మేసి, యిక ఓ పట్టాన వదలదు..............© 2017,www.logili.com All Rights Reserved.