Quite a Warm Quilt తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి
ముందుమాట వంటివి రాయడం నాకిష్టం ఉండదు, జంకు వల్ల. జంకు, ముందుమాటలు రాయడం చాతకానందువల్ల. కథలు, కవిత్వం కంటే ఈ తొలిపలుకులు రాయడం కష్టం అని నేననుకుంటాను. ఈ విద్య సులభంగా పట్టుబడేది కాదు. సమకాలీనుల్లో అతికొద్దిమందికి మాత్రమే శక్తిమంతమైన తొలిపలుకు జన్యువులున్నాయి. వాటివల్ల రసవత్తరమైన తొలిపలుకులు వెలువడుతాయి. మరి నేనెందుకీ సాహసానికి పూనుకున్నాను? నాకిష్టమైన రచయిత ఒకతను. వ్యక్తిగా, రచయితగా కూడా. తన నవలకి పరిచయం రాయమని అడగ్గానే రాశాను. అది అచ్చయిం తర్వాత నేను అనుకున్నట్టుగా రాయలేదని స్పష్టం అయింది. ఆ బాధ నన్నిప్పటికీ వదల్లేదు. సరే, గొర్తి సాయిగారిది అమలాపురం. ఇతని నాన్నగారు సూర్యనారాయణగారు నాకు పూర్వాశ్రమంలో మిత్రుడు, నేను అమలాపురం కాలేజీలో పనిచేస్తున్నప్పుడు. అందుచేత సాయిగారు అడగ్గానే (ఇంచుమించు) ఒప్పుకున్నాను. కానీ, ఇంకే రచయితనైనా, కొంచెం బాగా అర్థమయ్యే కథలు రాసేవాణ్ని అడిగి ఉండ వలసిందని అనుకుంటున్నాను.
కథలెలా రాయాలి, దేని గురించి రాయాలి అనే ప్రశ్నలు భూమి ఉన్నంత కాలం ఉంటూనే ఉంటాయి. రచన సృజనాత్మక వ్యవహారం. కొన్ని సూచనలు అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది. నిర్మాణం గురించి కూడా సలహాలకి అవకాశం ఉంటుంది. కానీ కథ చెప్పగలగడం శిక్షణ వల్ల కుదరదని నా ఉద్దేశ్యం. వస్తువు ఇదే అయి ఉండాలనీ, ఇలాగే రాయాలనీ శాసనం ఏవీ
Quite a Warm Quilt తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి ముందుమాట వంటివి రాయడం నాకిష్టం ఉండదు, జంకు వల్ల. జంకు, ముందుమాటలు రాయడం చాతకానందువల్ల. కథలు, కవిత్వం కంటే ఈ తొలిపలుకులు రాయడం కష్టం అని నేననుకుంటాను. ఈ విద్య సులభంగా పట్టుబడేది కాదు. సమకాలీనుల్లో అతికొద్దిమందికి మాత్రమే శక్తిమంతమైన తొలిపలుకు జన్యువులున్నాయి. వాటివల్ల రసవత్తరమైన తొలిపలుకులు వెలువడుతాయి. మరి నేనెందుకీ సాహసానికి పూనుకున్నాను? నాకిష్టమైన రచయిత ఒకతను. వ్యక్తిగా, రచయితగా కూడా. తన నవలకి పరిచయం రాయమని అడగ్గానే రాశాను. అది అచ్చయిం తర్వాత నేను అనుకున్నట్టుగా రాయలేదని స్పష్టం అయింది. ఆ బాధ నన్నిప్పటికీ వదల్లేదు. సరే, గొర్తి సాయిగారిది అమలాపురం. ఇతని నాన్నగారు సూర్యనారాయణగారు నాకు పూర్వాశ్రమంలో మిత్రుడు, నేను అమలాపురం కాలేజీలో పనిచేస్తున్నప్పుడు. అందుచేత సాయిగారు అడగ్గానే (ఇంచుమించు) ఒప్పుకున్నాను. కానీ, ఇంకే రచయితనైనా, కొంచెం బాగా అర్థమయ్యే కథలు రాసేవాణ్ని అడిగి ఉండ వలసిందని అనుకుంటున్నాను. కథలెలా రాయాలి, దేని గురించి రాయాలి అనే ప్రశ్నలు భూమి ఉన్నంత కాలం ఉంటూనే ఉంటాయి. రచన సృజనాత్మక వ్యవహారం. కొన్ని సూచనలు అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది. నిర్మాణం గురించి కూడా సలహాలకి అవకాశం ఉంటుంది. కానీ కథ చెప్పగలగడం శిక్షణ వల్ల కుదరదని నా ఉద్దేశ్యం. వస్తువు ఇదే అయి ఉండాలనీ, ఇలాగే రాయాలనీ శాసనం ఏవీ© 2017,www.logili.com All Rights Reserved.