ఏ కథైనా నీతిని ప్రభోదించాలి అన్న అరిస్టాటిల్ డిడాక్టిక్ సిద్ధాంతం నుండి ప్రారంభమైన కథలు అనేక వాదాలతో , విమర్శలతో పరిపరివిధాలుగా మారుతూ వచ్చింది. ప్రపంచంలో ఎన్ని భావజాలాలు మనిషిని నడిపించినా తర్కం అనేది ప్రధానం అని నేను నమ్ముతాను. తర్కం వలెనే కథలు తమ గమనాలను మారుస్తూ మార్చుకుంటూ వస్తుంది. కథ నీతి భోదించాలి అనే వాదం నుంచి కథ నీతి భోదించనక్కర్లేదు లేదా సమాజాన్ని మార్చనక్కర్లేదు అనే స్థాయికి వచ్చాము. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. రచయితలు సమాజాన్ని మార్చనక్కర్లేదు గాని సమాజాన్ని మార్చే అర్హత తన కలానికి ఉంటుంది. ఆ అర్హతను గుర్తిస్తారా లేదా అనేది సదరు రచయిత ఇష్టం. ఒక్కోసారి వ్యక్తిగతం కూడానూ.....