"హైద్రాబాదులో చిరకాలం నుంచి నివాసం ఉంటూ, ఇక్కడే ఉద్యోగం చేస్తూ సాహితీ రచనలు చేసిన సింగరాజు లింగమూర్తి - ఇక్కడి మధ్యతరగతి వాళ్ళ జీవితాలను చిత్రించాడు. నిజజీవితంలో చాలీచాలని జీతంతో సంసారం వెళ్ళదీసిన లింగమూర్తి మధ్యతరగతి వాళ్ళ సమస్యలను వాస్తవికంగా చిత్రించాడు. ఆ రోజుల్లోని తెలంగాణా జీవితాన్ని, పోరాటాలను చిత్రిస్తూ చిన్నవైనా మంచి నాటకీయ శిల్పం ఉన్న కథలు వ్రాసారు. అక్కడక్కడ పాఠకుల హృదయాలను కదిలించి, భావోద్విగ్నులను చేసే కథలూ ఈ సంపుటంలో ఉన్నాయి. కొన్ని పాఠకుల ముఖంలో దరహాసరేఖలను తెచ్చే కథలూ ఉన్నాయి."
- డా ముదిగంటి సుజాతారెడ్డి
"నిజాయితీ, నిబద్ధత గల రచయిత సింగరాజు లింగమూర్తి. కష్టాల కొలిమిలో వెలువడ్డ మేలిమైన రచనలను సమాజానికందించాడు. మన చుట్టూ ఆవరించుకున్న దారిద్ర్యం. అందువల్ల ఒంటబట్టిన వినయం. ఏమంటే ఎవరేమనుకుంటారోనన్న తెలియరాని భయం, చేస్తున్న పనిమీద శ్రద్ధా - దీక్షా కలగలిసిన మూర్తిమత్వం లింగమూర్తిది.. తాను చూస్తున్న సమాజంలో దిగజారుతూ - కనుమరుగవుతున్న మానవీయకోణాల్ని పసిగట్టి, వాటిని తన కథల్లో చూపెట్టిన రచయిత.. అతను సమాజం బడిలో తయారైన రచయిత."
- డా ఏటుకూరి ప్రసాద్
"సింగరాజు లింగమూర్తి గారు రచించిన ఈ సంపుటిలో చోటుచేసుకున్న ఇంచుమించు అన్ని కథలు మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే ఉదాంతాలకు సంబంధించినవే. ఎక్కువ కథలు విషాదాంతాలుగా ముగియటం గమనార్హం. ఆ కథల్ని చెప్పిన పద్ధతిలో స్పష్టత, సూటితనం కనిపిస్తాయి."
- అంపశయ్య నవీన్
"హైద్రాబాదులో చిరకాలం నుంచి నివాసం ఉంటూ, ఇక్కడే ఉద్యోగం చేస్తూ సాహితీ రచనలు చేసిన సింగరాజు లింగమూర్తి - ఇక్కడి మధ్యతరగతి వాళ్ళ జీవితాలను చిత్రించాడు. నిజజీవితంలో చాలీచాలని జీతంతో సంసారం వెళ్ళదీసిన లింగమూర్తి మధ్యతరగతి వాళ్ళ సమస్యలను వాస్తవికంగా చిత్రించాడు. ఆ రోజుల్లోని తెలంగాణా జీవితాన్ని, పోరాటాలను చిత్రిస్తూ చిన్నవైనా మంచి నాటకీయ శిల్పం ఉన్న కథలు వ్రాసారు. అక్కడక్కడ పాఠకుల హృదయాలను కదిలించి, భావోద్విగ్నులను చేసే కథలూ ఈ సంపుటంలో ఉన్నాయి. కొన్ని పాఠకుల ముఖంలో దరహాసరేఖలను తెచ్చే కథలూ ఉన్నాయి." - డా ముదిగంటి సుజాతారెడ్డి "నిజాయితీ, నిబద్ధత గల రచయిత సింగరాజు లింగమూర్తి. కష్టాల కొలిమిలో వెలువడ్డ మేలిమైన రచనలను సమాజానికందించాడు. మన చుట్టూ ఆవరించుకున్న దారిద్ర్యం. అందువల్ల ఒంటబట్టిన వినయం. ఏమంటే ఎవరేమనుకుంటారోనన్న తెలియరాని భయం, చేస్తున్న పనిమీద శ్రద్ధా - దీక్షా కలగలిసిన మూర్తిమత్వం లింగమూర్తిది.. తాను చూస్తున్న సమాజంలో దిగజారుతూ - కనుమరుగవుతున్న మానవీయకోణాల్ని పసిగట్టి, వాటిని తన కథల్లో చూపెట్టిన రచయిత.. అతను సమాజం బడిలో తయారైన రచయిత." - డా ఏటుకూరి ప్రసాద్ "సింగరాజు లింగమూర్తి గారు రచించిన ఈ సంపుటిలో చోటుచేసుకున్న ఇంచుమించు అన్ని కథలు మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే ఉదాంతాలకు సంబంధించినవే. ఎక్కువ కథలు విషాదాంతాలుగా ముగియటం గమనార్హం. ఆ కథల్ని చెప్పిన పద్ధతిలో స్పష్టత, సూటితనం కనిపిస్తాయి." - అంపశయ్య నవీన్
© 2017,www.logili.com All Rights Reserved.