అస్థిత్వం యొక్క మర్మాన్ని తెలుసుకోవాలన్నది లక్ష్యంగా గల విషయమే వేదాంతం. ప్రాచీన భారతీయ తత్త్వవేత్తల అనుభవం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా తన ఆలోచనా పరిధికి లోబడే 'సత్యాన్ని' గ్రహించగలడు. సంపూర్ణ సత్యాన్వేషణకు ఆలోచనా స్రవంతి పరిధిని పెంచుకుంటూ కృషిచేయాలి. ఒక దశలో సత్యం పలు రకాలుగా భాసిస్తుంది మానవులలో. "ఏకం సత విప్రా బహుదా వదంతి" అన్నాడు వేదం ఋషి వేల సంవత్సరాల నాడే. వేదాంతం మానవుని యొక్క అనుభవాలను వేటినీ తిరస్కరించాడు. అయితే కేవలం ఊహాత్మకమైన, అనుమానాస్పదమైన అనుభవాలకు వివరణ ఇవ్వదు. సత్యమార్గంలో ప్రయనించదల్చుకున్న జిజ్ఞాసువులు సరియైన సామర్థ్యం, అర్హతను ముందుగ పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాగ ద్వేషాలను త్యజించాలి.
పూర్వకాలంలో తత్త్వవేత్తలు, సాధకులు ఆత్మతత్త్వ విచారణ చేయటానికి గురువుల మార్గదర్శకంలో అర్హతను సంపాదించుకునేవారు. అయితే నేటి కాలంలో గురువులు, బాబాలు, పండితులు తాత్త్విక విచారణకు తమ ఆలోచనా సామర్థ్యం మాత్రం సరిపోతుందన్న స్థితికి వచ్చారు. కేవలం విశ్వాసం మీద ఆధారపడిన తమ ఆలోచనాధోరణితో ఇతరులకు దారి చూపించటానికి సాహసిస్తున్నారు. నేడు తత్త్వ విచారం ఆడంబరంగాను, వ్యాపారంగాను దర్శనమిస్తుంది. తాత్త్విక విచారంలో అంతిమ 'సత్యం' ఆనందమే. అక్కడ సత్యం, ఆనందం ఎప్పుడూ కలిసే ఉంటుంది. ఆనందం అనుభవించామని ఎవరన్నా ప్రకటించినంతమాత్రాన అది సత్యాన్ని గ్రహించినట్లుకాదు. సచ్చిదానందమే ప్రధానం. ఇదే వేదాంతం.
అస్థిత్వం యొక్క మర్మాన్ని తెలుసుకోవాలన్నది లక్ష్యంగా గల విషయమే వేదాంతం. ప్రాచీన భారతీయ తత్త్వవేత్తల అనుభవం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా తన ఆలోచనా పరిధికి లోబడే 'సత్యాన్ని' గ్రహించగలడు. సంపూర్ణ సత్యాన్వేషణకు ఆలోచనా స్రవంతి పరిధిని పెంచుకుంటూ కృషిచేయాలి. ఒక దశలో సత్యం పలు రకాలుగా భాసిస్తుంది మానవులలో. "ఏకం సత విప్రా బహుదా వదంతి" అన్నాడు వేదం ఋషి వేల సంవత్సరాల నాడే. వేదాంతం మానవుని యొక్క అనుభవాలను వేటినీ తిరస్కరించాడు. అయితే కేవలం ఊహాత్మకమైన, అనుమానాస్పదమైన అనుభవాలకు వివరణ ఇవ్వదు. సత్యమార్గంలో ప్రయనించదల్చుకున్న జిజ్ఞాసువులు సరియైన సామర్థ్యం, అర్హతను ముందుగ పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాగ ద్వేషాలను త్యజించాలి. పూర్వకాలంలో తత్త్వవేత్తలు, సాధకులు ఆత్మతత్త్వ విచారణ చేయటానికి గురువుల మార్గదర్శకంలో అర్హతను సంపాదించుకునేవారు. అయితే నేటి కాలంలో గురువులు, బాబాలు, పండితులు తాత్త్విక విచారణకు తమ ఆలోచనా సామర్థ్యం మాత్రం సరిపోతుందన్న స్థితికి వచ్చారు. కేవలం విశ్వాసం మీద ఆధారపడిన తమ ఆలోచనాధోరణితో ఇతరులకు దారి చూపించటానికి సాహసిస్తున్నారు. నేడు తత్త్వ విచారం ఆడంబరంగాను, వ్యాపారంగాను దర్శనమిస్తుంది. తాత్త్విక విచారంలో అంతిమ 'సత్యం' ఆనందమే. అక్కడ సత్యం, ఆనందం ఎప్పుడూ కలిసే ఉంటుంది. ఆనందం అనుభవించామని ఎవరన్నా ప్రకటించినంతమాత్రాన అది సత్యాన్ని గ్రహించినట్లుకాదు. సచ్చిదానందమే ప్రధానం. ఇదే వేదాంతం.© 2017,www.logili.com All Rights Reserved.