"గురజాడ స్త్రీ పాత్రల్ని వర్గీకరించడం కష్టం" అంటూనే జగన్ గురజాడ స్త్రీ పాత్రలను, అత్యంత సుక్ష్మాక్షికతో వర్గీకరించి, విశ్లేషించి వాఖ్యానించారు. స్త్రీల సమస్యల విషయంలో గురజాడ ధృక్పథమేమిటో, స్త్రీల సమస్యలకి ఆయన ప్రతిస్పందించిన తీరు ఎటువంటిదో చెప్పడానికి జగన్ ఏడు విభాగాలు గుర్తించి చర్చించారు. అవి 1. స్త్రీ విద్య 2.స్త్రీ పురుష సంబంధాలు 3. స్త్రీ స్వేఛ్చ 4. వేశ్యావృత్తి - పాతివ్రత్యం 5. మానవ శ్రమ శక్తి - ఇంటిచాకిరి 6. వైధవ్యం 7. స్త్రీ శక్తి మీద విశ్వాసం. ఇదంతా మూడవ అధ్యాయంలో, నాల్గవ అధ్యాయంలో గురజాడ స్త్రీ పాత్రలను ఫ్యూడల్ వ్యవస్థకు చెందినవనీ, పెట్టుబడిదారీ వ్యవస్థ ఆరంభదశకు చెందినవనీ వర్గీకరించారు. ఈ అధ్యయంలోనూ గురజాడ స్త్రీ పాత్రలను సమాజాన్ని అతిక్రమించిన పాత్రలు, సమాజానికి బద్దులైన పాత్రలు, సమాజానికి దిగువనున్న పాత్రలు అని మూడు రకాలుగా వింగడించి, మరలా వాటిలోని అంతిర్విభాగాలను గుర్తించారు. ఈ విభాగాలలో, వింగడింపులలో వచ్చే పాత్రలను సాంఘిక, చారిత్రక, మనస్తత్వ కారణాలతో పరామర్శించి గురజాడకు న్యాయం చేసారు జగన్.
1882 నాటి 'కుకూ' మొదలు 1915 నాటి 'లంగరెత్తు' దాకా గురజాడ సాహిత్యాన్ని జగన్ కూలంకుషంగా అధ్యయనం చేసి, స్త్రీ పాత్రలను విశ్లేషించారు. ఈ విశ్లేషణకు మార్క్రిజం, ఫ్రాయిడిజంలను తాత్విక భావ జాలంగా ఉపయోగించుకున్నారు. గురజాడ వాజ్మయంలో కనిపించే పాత్రలు, వినిపించే పాత్రలు ఏవి జగన్ దృష్టి నుంచి తప్పించుకోలేదు. అందుకే ఇది అరకొర పరిశోదన కాదు, సమగ్ర పరిశోదన.
- రాచపాళే౦ చంద్రశేఖరరెడ్డి
"గురజాడ స్త్రీ పాత్రల్ని వర్గీకరించడం కష్టం" అంటూనే జగన్ గురజాడ స్త్రీ పాత్రలను, అత్యంత సుక్ష్మాక్షికతో వర్గీకరించి, విశ్లేషించి వాఖ్యానించారు. స్త్రీల సమస్యల విషయంలో గురజాడ ధృక్పథమేమిటో, స్త్రీల సమస్యలకి ఆయన ప్రతిస్పందించిన తీరు ఎటువంటిదో చెప్పడానికి జగన్ ఏడు విభాగాలు గుర్తించి చర్చించారు. అవి 1. స్త్రీ విద్య 2.స్త్రీ పురుష సంబంధాలు 3. స్త్రీ స్వేఛ్చ 4. వేశ్యావృత్తి - పాతివ్రత్యం 5. మానవ శ్రమ శక్తి - ఇంటిచాకిరి 6. వైధవ్యం 7. స్త్రీ శక్తి మీద విశ్వాసం. ఇదంతా మూడవ అధ్యాయంలో, నాల్గవ అధ్యాయంలో గురజాడ స్త్రీ పాత్రలను ఫ్యూడల్ వ్యవస్థకు చెందినవనీ, పెట్టుబడిదారీ వ్యవస్థ ఆరంభదశకు చెందినవనీ వర్గీకరించారు. ఈ అధ్యయంలోనూ గురజాడ స్త్రీ పాత్రలను సమాజాన్ని అతిక్రమించిన పాత్రలు, సమాజానికి బద్దులైన పాత్రలు, సమాజానికి దిగువనున్న పాత్రలు అని మూడు రకాలుగా వింగడించి, మరలా వాటిలోని అంతిర్విభాగాలను గుర్తించారు. ఈ విభాగాలలో, వింగడింపులలో వచ్చే పాత్రలను సాంఘిక, చారిత్రక, మనస్తత్వ కారణాలతో పరామర్శించి గురజాడకు న్యాయం చేసారు జగన్. 1882 నాటి 'కుకూ' మొదలు 1915 నాటి 'లంగరెత్తు' దాకా గురజాడ సాహిత్యాన్ని జగన్ కూలంకుషంగా అధ్యయనం చేసి, స్త్రీ పాత్రలను విశ్లేషించారు. ఈ విశ్లేషణకు మార్క్రిజం, ఫ్రాయిడిజంలను తాత్విక భావ జాలంగా ఉపయోగించుకున్నారు. గురజాడ వాజ్మయంలో కనిపించే పాత్రలు, వినిపించే పాత్రలు ఏవి జగన్ దృష్టి నుంచి తప్పించుకోలేదు. అందుకే ఇది అరకొర పరిశోదన కాదు, సమగ్ర పరిశోదన. - రాచపాళే౦ చంద్రశేఖరరెడ్డి
© 2017,www.logili.com All Rights Reserved.