ఈ సంపుటిలో కథలన్నీ 1987 - 97 మధ్యకాలంలో రాసినవి. అశ్రద్ధవల్ల కొన్ని కనపడకుండా పోగా కనబడినవి ఏరుకొని, మాలకట్టి మీ ముందు పెడుతున్నాను. ఈ కథలలోని సంఘటనలు దాదాపు అన్నీ జరిగినవే. నా మనసును ద్రవింపచేసిన ఘటనకి కథారూపం ఇచ్చి నా భావాలని పాఠకులతో పంచుకున్నాను. మళ్ళీ వాటిని పుస్తకంగా తేవడంలో ఉద్దేశ్యం...
ఒక కాలంలోని మనుషుల మనోభావాలనూ, ఆలోచనలూ, పరిస్థితులనూ, చారిత్రిక సంఘటనలనూ రికార్డుగా వుంచుకోవచ్చనే కోరికా, మళ్ళీ ఓసారి నా కథలతో పాఠకుల హృదయాల్లోకి తొంగి చూడొచ్చన్న స్వార్థంతో కూడిన ఆశ...! అప్పుడెప్పుడో రాసిన కథల్ని మళ్ళీ మంచి ప్రింటులో ఫ్రెష్ గా కొత్త పాఠకురాలిగా చదువుకొని హృదయంతో ఆనందించవచ్చన్న చిరుఆశ కూడా ఈ సంపుటి వేయడానికి నన్ను కదిలించింది.
- రావులపల్లి సునీత
ఈ సంపుటిలో కథలన్నీ 1987 - 97 మధ్యకాలంలో రాసినవి. అశ్రద్ధవల్ల కొన్ని కనపడకుండా పోగా కనబడినవి ఏరుకొని, మాలకట్టి మీ ముందు పెడుతున్నాను. ఈ కథలలోని సంఘటనలు దాదాపు అన్నీ జరిగినవే. నా మనసును ద్రవింపచేసిన ఘటనకి కథారూపం ఇచ్చి నా భావాలని పాఠకులతో పంచుకున్నాను. మళ్ళీ వాటిని పుస్తకంగా తేవడంలో ఉద్దేశ్యం... ఒక కాలంలోని మనుషుల మనోభావాలనూ, ఆలోచనలూ, పరిస్థితులనూ, చారిత్రిక సంఘటనలనూ రికార్డుగా వుంచుకోవచ్చనే కోరికా, మళ్ళీ ఓసారి నా కథలతో పాఠకుల హృదయాల్లోకి తొంగి చూడొచ్చన్న స్వార్థంతో కూడిన ఆశ...! అప్పుడెప్పుడో రాసిన కథల్ని మళ్ళీ మంచి ప్రింటులో ఫ్రెష్ గా కొత్త పాఠకురాలిగా చదువుకొని హృదయంతో ఆనందించవచ్చన్న చిరుఆశ కూడా ఈ సంపుటి వేయడానికి నన్ను కదిలించింది. - రావులపల్లి సునీత
© 2017,www.logili.com All Rights Reserved.