నా మాట
ముందుగా నా పేరు హర్షవర్ధన్, అనంతపురం జిల్లా రాయదుర్గం మా ఊరు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను. చిన్నప్పట్నుంచీ తెలుగంటి చాలా ఇష్టం, సాహిత్యమంటే ఇంకా ఇష్టం. కానీ పాఠశాల రోజుల్లో పాఠ్యపుస్తకాలతోనే సరిపోయేది. ఆలోచనలన్నీ బుర్రలోనే తిరిగేవి కానీ ప్రత్యేకంగా రాయడం, చదవడం ఎప్పుడూ లేదు. నేను రాయగలననే నమ్మకమొచ్చింది మాత్రం పదోతరగతిలో, పదోతరగతి చదువుతున్న రోజుల్లో ఈనాడువాళ్ళు తెలుగు భాష మీద నిర్వహించిన ప్రతిభాపాఠవ పోటిలో మా మండలంలో ప్రథమస్థానంలో నిలవడంతో రాయగలననే నమ్మకమొచ్చింది. బహుమతిగా బుడుగు పుస్తకం ఇవ్వడంతో పుస్తకపఠనం అలవాటైంది. ఇంజినీరింగ్ చదివే రోజుల్లో కొంచెం రాయడం మొదలుపెట్టాను. Facebookలో హర్షడైలాగ్స్ అని ఒక పేజ్ పెట్టి అందులో రాసేవాడిని (ఇప్పుడా పేజ్ లేదు). తర్వాత కెరీర్ లో పడిపోయి రాయడం పూర్తిగా మానేసాను. ఉద్యోగంలో చేరిన చాలా నెలల తర్వాత మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. Instagramలో హర్షడైలాగ్స్ పేజ్ పెట్టి సీరియస్ గా రాయడం మొదలుపెట్టాను. Instagram పేజ్ వల్ల రాయగలననే నమ్మకానికి, రాస్తే అభిమానించే,
రాయమని ప్రోత్సహించే మనుషులు దొరికారు. కలం, కాగితం పట్టుకుని రాసే రకం కాదు నేను. అసలు రాయాలి అనుకుని రాయడం కూడా ఉండదు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడో, చూస్తున్నప్పుడో, వింటున్నప్పుడో, చదువుతున్నప్పుడో, ఆలోచిస్తున్నప్పుడో ఇలా ఎన్నో వాటిల్లోంచి
వచ్చిన వాక్యాలే ఇవన్నీ.సూటిగా సుత్తిలేకుండా వీలైనన్ని తక్కువ పదాల్లో రాయడం నా శైలి. నేను పెరిగిన జీవితం, సంఘటనలు, సంఘర్షణలు, అనుభవాలు, చూసిన మనుషులు, సినిమాలు, చదివిన పుస్తకాలు ఇలాంటివెన్నో నా రచనకి ఆదర్శాలు, Instagramలో ఎంత రాసినా ఒక రచయితగా నా రచనలు పుస్తకరూపంలో చూసుకున్నప్పుడే కదా సంతృప్తి, అలాగే నా రచనలు Instagramకే పరిమితం | కాకుండా మరింత మందికి చేరువ చేయాలనే ప్రయత్నమే ఈ పుస్తకం. -
ప్రతి ఒక్కరి భావోద్వేగాల గొంతుకే ఈ పుస్తకం.
- భూపసముద్రం హర్షవర్ధన్
నా మాట ముందుగా నా పేరు హర్షవర్ధన్, అనంతపురం జిల్లా రాయదుర్గం మా ఊరు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను. చిన్నప్పట్నుంచీ తెలుగంటి చాలా ఇష్టం, సాహిత్యమంటే ఇంకా ఇష్టం. కానీ పాఠశాల రోజుల్లో పాఠ్యపుస్తకాలతోనే సరిపోయేది. ఆలోచనలన్నీ బుర్రలోనే తిరిగేవి కానీ ప్రత్యేకంగా రాయడం, చదవడం ఎప్పుడూ లేదు. నేను రాయగలననే నమ్మకమొచ్చింది మాత్రం పదోతరగతిలో, పదోతరగతి చదువుతున్న రోజుల్లో ఈనాడువాళ్ళు తెలుగు భాష మీద నిర్వహించిన ప్రతిభాపాఠవ పోటిలో మా మండలంలో ప్రథమస్థానంలో నిలవడంతో రాయగలననే నమ్మకమొచ్చింది. బహుమతిగా బుడుగు పుస్తకం ఇవ్వడంతో పుస్తకపఠనం అలవాటైంది. ఇంజినీరింగ్ చదివే రోజుల్లో కొంచెం రాయడం మొదలుపెట్టాను. Facebookలో హర్షడైలాగ్స్ అని ఒక పేజ్ పెట్టి అందులో రాసేవాడిని (ఇప్పుడా పేజ్ లేదు). తర్వాత కెరీర్ లో పడిపోయి రాయడం పూర్తిగా మానేసాను. ఉద్యోగంలో చేరిన చాలా నెలల తర్వాత మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. Instagramలో హర్షడైలాగ్స్ పేజ్ పెట్టి సీరియస్ గా రాయడం మొదలుపెట్టాను. Instagram పేజ్ వల్ల రాయగలననే నమ్మకానికి, రాస్తే అభిమానించే, రాయమని ప్రోత్సహించే మనుషులు దొరికారు. కలం, కాగితం పట్టుకుని రాసే రకం కాదు నేను. అసలు రాయాలి అనుకుని రాయడం కూడా ఉండదు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడో, చూస్తున్నప్పుడో, వింటున్నప్పుడో, చదువుతున్నప్పుడో, ఆలోచిస్తున్నప్పుడో ఇలా ఎన్నో వాటిల్లోంచి వచ్చిన వాక్యాలే ఇవన్నీ.సూటిగా సుత్తిలేకుండా వీలైనన్ని తక్కువ పదాల్లో రాయడం నా శైలి. నేను పెరిగిన జీవితం, సంఘటనలు, సంఘర్షణలు, అనుభవాలు, చూసిన మనుషులు, సినిమాలు, చదివిన పుస్తకాలు ఇలాంటివెన్నో నా రచనకి ఆదర్శాలు, Instagramలో ఎంత రాసినా ఒక రచయితగా నా రచనలు పుస్తకరూపంలో చూసుకున్నప్పుడే కదా సంతృప్తి, అలాగే నా రచనలు Instagramకే పరిమితం | కాకుండా మరింత మందికి చేరువ చేయాలనే ప్రయత్నమే ఈ పుస్తకం. - ప్రతి ఒక్కరి భావోద్వేగాల గొంతుకే ఈ పుస్తకం. - భూపసముద్రం హర్షవర్ధన్© 2017,www.logili.com All Rights Reserved.