కొద్ది కాలంగా మనచుట్టూ ఎంతో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు మరింత వేగంగా మనలోకి చొచ్చుకు పోతున్నాయి. మనలోకి ఇంకిపోతున్నాయి. ఆ వేగాన్ని అందుకోగల శక్తియుక్తులు కలిగివున్నా లేకున్నా - మనం అందరం ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోతున్నాం. విలువలు మారిపోతున్నాయి. నిన్నటి విలువలు ఈ రోజుటివి కావు. ఉదయపు విలువలు సాయంత్రానివి కావు! మార్పులు అనివార్యం. అవసరం. మారుతున్న పరిసరాలకు అనుగుణంగా మారిపోగల నైపుణ్యం మానవులుగా మన సహజ సిద్ధ గుణం.
క్షణమొక తీరుగా మారుతున్న ఈనాటి పరిస్థితులలో మనం ఎలా ఉన్నాం? సంతోషంగా ఉన్నామా? హాయిగా జీవిస్తున్నామా? ప్రపంచ విఫణి, దాని చుట్టూ పరిభ్రమించే వస్తు ప్రభావం మారుమూల ప్రాంతాలను వ్యామోహమై ముంచి వేస్తున్నది. చాప కింద నీరులా. 'వస్తువు' తెరిచి ఉంచిన పంచవెన్నెల పంజరంలోకి మనం నవ్వుతూ నడిఛి వెళుతున్నాం. చేతనాచేతనా విచక్షణకు నీళ్ళోదిలి. ఇందులో - స్థాయీ బేధాలు, కలమి లేములు, చదువు సంధ్యలు - ఏ పరిమితులు లేవు. వస్తు వ్యామోహం - అది ఒక ఖరీదైన కారు, టివి కావచ్చు - సబ్బుబిళ్ళ, షాంపూ సీసా కావచ్చు - క్షణానికొక రూపం మార్చుకుంటూ మన చుట్టూ అల్లుకుపోతూ ఉంది.
కొద్ది కాలంగా మనచుట్టూ ఎంతో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు మరింత వేగంగా మనలోకి చొచ్చుకు పోతున్నాయి. మనలోకి ఇంకిపోతున్నాయి. ఆ వేగాన్ని అందుకోగల శక్తియుక్తులు కలిగివున్నా లేకున్నా - మనం అందరం ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోతున్నాం. విలువలు మారిపోతున్నాయి. నిన్నటి విలువలు ఈ రోజుటివి కావు. ఉదయపు విలువలు సాయంత్రానివి కావు! మార్పులు అనివార్యం. అవసరం. మారుతున్న పరిసరాలకు అనుగుణంగా మారిపోగల నైపుణ్యం మానవులుగా మన సహజ సిద్ధ గుణం. క్షణమొక తీరుగా మారుతున్న ఈనాటి పరిస్థితులలో మనం ఎలా ఉన్నాం? సంతోషంగా ఉన్నామా? హాయిగా జీవిస్తున్నామా? ప్రపంచ విఫణి, దాని చుట్టూ పరిభ్రమించే వస్తు ప్రభావం మారుమూల ప్రాంతాలను వ్యామోహమై ముంచి వేస్తున్నది. చాప కింద నీరులా. 'వస్తువు' తెరిచి ఉంచిన పంచవెన్నెల పంజరంలోకి మనం నవ్వుతూ నడిఛి వెళుతున్నాం. చేతనాచేతనా విచక్షణకు నీళ్ళోదిలి. ఇందులో - స్థాయీ బేధాలు, కలమి లేములు, చదువు సంధ్యలు - ఏ పరిమితులు లేవు. వస్తు వ్యామోహం - అది ఒక ఖరీదైన కారు, టివి కావచ్చు - సబ్బుబిళ్ళ, షాంపూ సీసా కావచ్చు - క్షణానికొక రూపం మార్చుకుంటూ మన చుట్టూ అల్లుకుపోతూ ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.