ప్రపంచంలో మనం ప్రతిబింబాలం
జీవితంలో నీడలా వెంటాడే ప్రత్యేక్ష సాక్షులం
బింబంలో స్పష్టంగా అగుపిస్తాం.
కానీ హృదయం కనిపించదు.
నీడలో రేఖా మాత్రంగా ప్రతిఫలిస్తాం
కానీ మనసు వినిపించదు
ఇలా మనకు మనమే
స్పష్టంగా రూపాలం.....అస్పష్టంగా నీడలం
అయినా కాంతి ప్రసరణతోనే
రూపం అయినా నీడ అయినా
అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలెన్నో
వినిపించే జీవితంలో వెలికి రాని రహస్యాలు ఇంకెన్నో
సమస్య మనమైతే పరిష్కారం మన నీడే
రెండిటిపైన కాంతి ప్రసరణ జరగాలి
అప్పుడే బ్రతుకు వెలుతురు ముద్ద అవుతుంది
ఈ కాంతి వేగంలో
నా పదమైనా, పాదమైనా
ప్రతి ఒక్కరికివెలుగు పరచటానికే
అక్షర సాక్షిగాను, ఆత్మ సాక్షిగాను.....
-వాసిలి వసంతకుమార్.
ప్రపంచంలో మనం ప్రతిబింబాలం జీవితంలో నీడలా వెంటాడే ప్రత్యేక్ష సాక్షులం బింబంలో స్పష్టంగా అగుపిస్తాం. కానీ హృదయం కనిపించదు. నీడలో రేఖా మాత్రంగా ప్రతిఫలిస్తాం కానీ మనసు వినిపించదు ఇలా మనకు మనమే స్పష్టంగా రూపాలం.....అస్పష్టంగా నీడలం అయినా కాంతి ప్రసరణతోనే రూపం అయినా నీడ అయినా అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలెన్నో వినిపించే జీవితంలో వెలికి రాని రహస్యాలు ఇంకెన్నో సమస్య మనమైతే పరిష్కారం మన నీడే రెండిటిపైన కాంతి ప్రసరణ జరగాలి అప్పుడే బ్రతుకు వెలుతురు ముద్ద అవుతుంది ఈ కాంతి వేగంలో నా పదమైనా, పాదమైనా ప్రతి ఒక్కరికివెలుగు పరచటానికే అక్షర సాక్షిగాను, ఆత్మ సాక్షిగాను..... -వాసిలి వసంతకుమార్.
© 2017,www.logili.com All Rights Reserved.