అందరికీ నచ్చే సుందర రచన
ముప్పై వసంతాల నాటి ముచ్చట్లతో ముందుమాటను ఆరంభిస్తాను. నాడు నేను ఉస్మానియా యూనివర్సిటి తెలుగు విభాగంలో పరిశోధక (పిహెచ్.డి) విద్యార్థిని. భాగ్యనగరంలో అది సాయంత్రం. నాలుగైదు కార్యక్రమాలైనా జరుగుతున్న బంగారపు రోజులవి. చిక్కడపల్లి ఈ సభల కీలక వేదిక. నావంటి నలుగురైదుగురు నవయువకులు దాదాపు ప్రతిరోజూ ఈ కార్యక్రమాలకు హాజరు కావడం రివాజు.
అప్పట్లో చీకోలు సుందరయ్య గారు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో "రంగ తరంగం" పేరుతో నగరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల సమీక్షా కథనాలు వ్రాసేవారు. అంత స్పష్టంగా చెప్పలేను కానీ, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కృష్ణశాస్త్రి గారిమీద సిద్ధాంత గ్రంథం ఏదో ఆవిష్కరణసభ. ఆవిష్కరణ | కర్త సి.నా.రె. దిగ్గజాల వంటి కవులు, అనేకమంది సాహిత్యా భిమానులైన శ్రోతలు. సభ కిటకిటలాడుతున్నది. కొంతమంది చోటు దొరకక నిలబడ్డ పరిస్థితి. సి.నా.రె. ప్రసంగం సహజ సిద్ధమైన సభారంజకంగా సాగిపోతున్నది. మధ్యలో తన | ప్రసంగానికి కొంచెం విరామం ఇచ్చి "చూశారా ! ఈ కార్యక్రమం దిగ్విజయం | అయినట్టే లెక్క. మా మిత్రుడూ ప్రతిభావంతుడైన పాత్రికేయుడు చీకోలు | సుందరయ్య సైతం నిలబడే వార్త రాస్తున్నాడు" అన్నారు సి.నా.రె. అందరి దృష్టి సుందరయ్య గారి వైపు దిరిగితే సుందరయ్య గారి చూపు మాత్రం సి.నా.రె. ప్రసంగాన్ని సునిశితంగా వీక్షిస్తున్నది. ఆ రోజుల్లో సుందరయ్య 'రంగ తరంగం ........
అందరికీ నచ్చే సుందర రచన ముప్పై వసంతాల నాటి ముచ్చట్లతో ముందుమాటను ఆరంభిస్తాను. నాడు నేను ఉస్మానియా యూనివర్సిటి తెలుగు విభాగంలో పరిశోధక (పిహెచ్.డి) విద్యార్థిని. భాగ్యనగరంలో అది సాయంత్రం. నాలుగైదు కార్యక్రమాలైనా జరుగుతున్న బంగారపు రోజులవి. చిక్కడపల్లి ఈ సభల కీలక వేదిక. నావంటి నలుగురైదుగురు నవయువకులు దాదాపు ప్రతిరోజూ ఈ కార్యక్రమాలకు హాజరు కావడం రివాజు. అప్పట్లో చీకోలు సుందరయ్య గారు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో "రంగ తరంగం" పేరుతో నగరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల సమీక్షా కథనాలు వ్రాసేవారు. అంత స్పష్టంగా చెప్పలేను కానీ, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కృష్ణశాస్త్రి గారిమీద సిద్ధాంత గ్రంథం ఏదో ఆవిష్కరణసభ. ఆవిష్కరణ | కర్త సి.నా.రె. దిగ్గజాల వంటి కవులు, అనేకమంది సాహిత్యా భిమానులైన శ్రోతలు. సభ కిటకిటలాడుతున్నది. కొంతమంది చోటు దొరకక నిలబడ్డ పరిస్థితి. సి.నా.రె. ప్రసంగం సహజ సిద్ధమైన సభారంజకంగా సాగిపోతున్నది. మధ్యలో తన | ప్రసంగానికి కొంచెం విరామం ఇచ్చి "చూశారా ! ఈ కార్యక్రమం దిగ్విజయం | అయినట్టే లెక్క. మా మిత్రుడూ ప్రతిభావంతుడైన పాత్రికేయుడు చీకోలు | సుందరయ్య సైతం నిలబడే వార్త రాస్తున్నాడు" అన్నారు సి.నా.రె. అందరి దృష్టి సుందరయ్య గారి వైపు దిరిగితే సుందరయ్య గారి చూపు మాత్రం సి.నా.రె. ప్రసంగాన్ని సునిశితంగా వీక్షిస్తున్నది. ఆ రోజుల్లో సుందరయ్య 'రంగ తరంగం ........© 2017,www.logili.com All Rights Reserved.