"ధర్మో రక్షతి రక్షితః" ధర్మమును మనము ఆచరించినచో అది మనలను రక్షించును. ధర్మము అనగా విహిత కర్మచరణము. అందు వలననే గీతాచార్యుడు "స్వధర్మే నిదానంశ్రేయః" అని ఘంటాపదముగా చెప్పియున్నాడు. ధర్మమునకు వేదము మూలము. విహిత కర్మలు అనగా తనకు నిర్దేశింపబడిన కర్మలు. చాతుర్యర్ణముల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శుద్రులు) వారికీ చతురశ్రమముల (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు) యందు జాగృతి స్వప్న సుషుప్తి తురీయము లనబడు నాలుగు అవస్థల యందును, తనకు ఏది నిర్దేశింపబడినదో దానిని ఆచరించుటయే ధర్మము.
మానవజీవితము సార్థకము చేసుకొనవలయునన్నచో పురుషార్థములు సాదించవలయును. ధర్మము, అర్ధము, కామము, మోక్షము అనునవి చతుర్విద పురుషార్థములు. అందు మొదటిది ధర్మము. అనగా ధర్మాచరణము. అది లేనిచో మిగిలిన మూడును సాధింప దుర్లభము.
"జంతూనాం నరజన్మ దుర్లభం" ఎంతో పూర్వపుణ్యఫలము వలన ఈ మానవజన్మ లభించుచున్నది. ఆహారము, మైథునము, నిద్ర భయము, అను నాలుగు సమస్త జీవరాసులు సమానము. ఒక్క ధర్మాచరణము మాత్రమే మానవుని మిగిలిన జీవరాసుల నుండి వేరుచేయుచున్నది.
- శ్రీ దోసపాటి రామకృష్ణ