విశ్వాoతర్యామి పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన యోగ శాస్త్రము, ఉపనిషత్ సారము ఈ భగవద్గీత. శ్రీ కృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు. వీరి సంభాషణను వ్యాస మునీoద్రులు అక్షర బద్ధం చేసి మనకు అందించారు. ఈ భగవద్గీత ప్రతి మనిషికి మోక్షానికి మార్గం చూపుతుంది.
ఈ గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగ ప్రారంభం కాక ముందు చెప్పబడింది. కలియుగంలో ధర్మము క్షీణిస్తుందనీ, ఒంటి పాదంతో నడుస్తుందనీ, తెలిసి రాబోవు కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు.
- గాజుల సత్యనారాయణ