ప్రభాకర్ మరణించి ఇరవై ఒక్క సంవత్సరం పూర్తయింది. అంతకుముందే వేసిన కవితా చిత్రాల పోస్టర్లు అతని కొడుకుల వయస్సంత. రెండు దశాబ్దాలుగా ప్రభాకర్ని మరచిన మిత్రులు, ఆ పోస్టర్లనీ మరచిపోయారు. ఎక్కడ ఉన్నాయో అని వెతికి వెతికి ఆరా తీస్తే అవి హైదరాబాద్ లోని ప్రభాకర్ ఇంట్లోనే అటకల మీద దుమ్మూ ధూళి పట్టిన సంచుల్లో దాగి ఉన్నాయి. కొన్ని పాడై, కొన్ని శిధిలమై, గాయపడి క్షీణించిన ప్రభాకర్ శరీరంలా...
మనవి ఒంటరి చేసిన అలిశెట్టి రేఖలలోకి మరోసారి ఆత్మీయంగా ప్రయాణించాలి. అతని భావాలలో చొరబడటానికి మనం అర్హులం. తనని తాను 'ధ్వని'ని చేసి, అభివ్యక్తం చేసి, మనల్ని పలకరించే పోస్టర్లనీ, కవితలనీ ఆలింగనం చేసుకుందాం. పాత నలుపు పేజీలపై, నల్లని పెన్సిల్ గీతలలోంచి, ఒలికిపోగా, మిగిలి గడ్డకట్టిన ఇండియన్ ఇంక్ పై వేసిన నీటి చుక్కలతో పాటు, మనమూ కరిగిపోదాం. ఇవి ఒక తరం కిందటి హృదయ స్పందనలు. నులివెచ్చని భావస్ఫోరకాలు. ఇవి మన ఆలోచనల పాదాల కింద పేలే ల్యాండ్ మైన్లు. మన మెదడులో ఆగకుండా జరిగే భావాల కూంబింగ్. మన తరం అరుదైన తెలుగు కవీ, చిత్రకారుడి సమాజ హృదయావిష్కరణలు. కలం, కుంచెల ఐక్యభావధార! ఇదొక కొత్త సాహిత్యజీవ ప్రక్రియ. అందులోకి ప్రవేశిద్దాం.
- జయదేవ్ తిరుమలరావు
ప్రభాకర్ మరణించి ఇరవై ఒక్క సంవత్సరం పూర్తయింది. అంతకుముందే వేసిన కవితా చిత్రాల పోస్టర్లు అతని కొడుకుల వయస్సంత. రెండు దశాబ్దాలుగా ప్రభాకర్ని మరచిన మిత్రులు, ఆ పోస్టర్లనీ మరచిపోయారు. ఎక్కడ ఉన్నాయో అని వెతికి వెతికి ఆరా తీస్తే అవి హైదరాబాద్ లోని ప్రభాకర్ ఇంట్లోనే అటకల మీద దుమ్మూ ధూళి పట్టిన సంచుల్లో దాగి ఉన్నాయి. కొన్ని పాడై, కొన్ని శిధిలమై, గాయపడి క్షీణించిన ప్రభాకర్ శరీరంలా... మనవి ఒంటరి చేసిన అలిశెట్టి రేఖలలోకి మరోసారి ఆత్మీయంగా ప్రయాణించాలి. అతని భావాలలో చొరబడటానికి మనం అర్హులం. తనని తాను 'ధ్వని'ని చేసి, అభివ్యక్తం చేసి, మనల్ని పలకరించే పోస్టర్లనీ, కవితలనీ ఆలింగనం చేసుకుందాం. పాత నలుపు పేజీలపై, నల్లని పెన్సిల్ గీతలలోంచి, ఒలికిపోగా, మిగిలి గడ్డకట్టిన ఇండియన్ ఇంక్ పై వేసిన నీటి చుక్కలతో పాటు, మనమూ కరిగిపోదాం. ఇవి ఒక తరం కిందటి హృదయ స్పందనలు. నులివెచ్చని భావస్ఫోరకాలు. ఇవి మన ఆలోచనల పాదాల కింద పేలే ల్యాండ్ మైన్లు. మన మెదడులో ఆగకుండా జరిగే భావాల కూంబింగ్. మన తరం అరుదైన తెలుగు కవీ, చిత్రకారుడి సమాజ హృదయావిష్కరణలు. కలం, కుంచెల ఐక్యభావధార! ఇదొక కొత్త సాహిత్యజీవ ప్రక్రియ. అందులోకి ప్రవేశిద్దాం. - జయదేవ్ తిరుమలరావు© 2017,www.logili.com All Rights Reserved.