అభిప్రాయములు
ప్రమోదము
“విద్వా న్" బ్రహ్మశ్రీ బులుసు సూర్యప్రకాశశాస్త్రి "వ్యవస్థాపకులు" సాధన గ్రంథమండలి, తెనాలి. "వేదెవి సహితం సురద్రుమతలే హైమే మహామంటపే” అంటూ ఓ చంద్రుడు సీతాసమేతుడై సురద్రుమం కల్పవృక్షమే కావచ్చు చెటు కూర్చునట్లు ధ్యానించుచున్నారేల? ఆయనకు ఇల్లు లేదా?
సుసంగతమో అసంగతమో - ప్రశ్న ప్రశ్నయే. దానికి ఒక సమాధానం కావాలిగదా! వాస్తుశాస్త్ర పండితులు చెప్పే సమాధానం ఇలా ఉంది...
అభిషేక ముహూర్తం వసిష్ఠులవారే నిర్ణయించినా - సింహాసనాన్ని తప్పుదిశలో ఉంచిన కారణంగా పట్టాభిషేకం వనవాసమైనది.
"పోనీ” అనుకుంటే - వనంలో లక్ష్మణస్వామి పర్ణశాలా నిర్మాణం చేసూ - ద్వారం తప్పుగా పెట్టినాడట. ఆ కారణంగా వాడెవడో వచ్చే, ఇల్లాలిని ఎత్తుకు పోయేడు.
ఆ సమస్యలనుండి బయట పడడానికి ఎన్నాళ్ళు ఎంత శ్రమ అయినది.
అందుచే స్వామికి వాస్తు అంటే భయం చెట్టుక్రింద కాపురం పెట్టేడు. స్వామి కనుక కల్పవృక్షం క్రింద చోటు సంపాదించాడు - అన్నారు వాసు | పండితులు.
ఈ సమాధానంలో యధార్ధంకంటె చమత్కారమే అధికం, అయినా యదార్ధం లేకపోలేదు.
మయసభావృత్తం కూడా ఇలాంటిదే అంటారు. దుర్యోధనుడు పాండవులంటే | | ఈసు కలవాడన్నది నిజమే కాని చదువురాని శుంఠకాదు.
అతడు మయసభలో ప్రవేశించేడు - "ద్వారానికి ద్వారం పోటీగా ఉంటుంది. ఈశాన్యం పల్లంగా జలమయంతో నిండి వుంటుంది. నైఋతి మెరకగా ఉంటుంది.” కనిపించడం అలాగే కనిపిస్తుంది.
ద్వారానికి ఎదురుగా ద్వారం ఉన్నట్లు కనిపిస్తోంది. కాని ద్వారం లేదు. ఈశాన్యం జలమయంగా కనిపిస్తోంది. కాని అది మెరక, నైఋతి మెరకగా, కనుపిస్తుంది. కాని అది మేరక, నైఋతి మెరకగా కనిపిస్తుంది. కాని అదిపల్లం - జలమయం.
నిర్మాణం శాస్త్రానికి అనుకూలంగా కనిపిస్తూ శాస్త్ర విరుద్ధంగా ఉంది. | అందుచే దుర్యోధనుడు భంగపడ్డాడు. |
ఇక పాండవులు అడవుల పాలయ్యేరు. విరాటుని దాసులై దాక్కున్నారు తామరతంపరగా కలకలలాడుతూ ఉన్నవారి సంసారానికి వంశ ఉత్తరా గర్భం తప్పవేరేమి లేకుండా పోయింది.............
అభిప్రాయములు ప్రమోదము “విద్వా న్" బ్రహ్మశ్రీ బులుసు సూర్యప్రకాశశాస్త్రి "వ్యవస్థాపకులు" సాధన గ్రంథమండలి, తెనాలి. "వేదెవి సహితం సురద్రుమతలే హైమే మహామంటపే” అంటూ ఓ చంద్రుడు సీతాసమేతుడై సురద్రుమం కల్పవృక్షమే కావచ్చు చెటు కూర్చునట్లు ధ్యానించుచున్నారేల? ఆయనకు ఇల్లు లేదా? సుసంగతమో అసంగతమో - ప్రశ్న ప్రశ్నయే. దానికి ఒక సమాధానం కావాలిగదా! వాస్తుశాస్త్ర పండితులు చెప్పే సమాధానం ఇలా ఉంది... అభిషేక ముహూర్తం వసిష్ఠులవారే నిర్ణయించినా - సింహాసనాన్ని తప్పుదిశలో ఉంచిన కారణంగా పట్టాభిషేకం వనవాసమైనది. "పోనీ” అనుకుంటే - వనంలో లక్ష్మణస్వామి పర్ణశాలా నిర్మాణం చేసూ - ద్వారం తప్పుగా పెట్టినాడట. ఆ కారణంగా వాడెవడో వచ్చే, ఇల్లాలిని ఎత్తుకు పోయేడు. ఆ సమస్యలనుండి బయట పడడానికి ఎన్నాళ్ళు ఎంత శ్రమ అయినది. అందుచే స్వామికి వాస్తు అంటే భయం చెట్టుక్రింద కాపురం పెట్టేడు. స్వామి కనుక కల్పవృక్షం క్రింద చోటు సంపాదించాడు - అన్నారు వాసు | పండితులు. ఈ సమాధానంలో యధార్ధంకంటె చమత్కారమే అధికం, అయినా యదార్ధం లేకపోలేదు. మయసభావృత్తం కూడా ఇలాంటిదే అంటారు. దుర్యోధనుడు పాండవులంటే | | ఈసు కలవాడన్నది నిజమే కాని చదువురాని శుంఠకాదు. అతడు మయసభలో ప్రవేశించేడు - "ద్వారానికి ద్వారం పోటీగా ఉంటుంది. ఈశాన్యం పల్లంగా జలమయంతో నిండి వుంటుంది. నైఋతి మెరకగా ఉంటుంది.” కనిపించడం అలాగే కనిపిస్తుంది. ద్వారానికి ఎదురుగా ద్వారం ఉన్నట్లు కనిపిస్తోంది. కాని ద్వారం లేదు. ఈశాన్యం జలమయంగా కనిపిస్తోంది. కాని అది మెరక, నైఋతి మెరకగా, కనుపిస్తుంది. కాని అది మేరక, నైఋతి మెరకగా కనిపిస్తుంది. కాని అదిపల్లం - జలమయం. నిర్మాణం శాస్త్రానికి అనుకూలంగా కనిపిస్తూ శాస్త్ర విరుద్ధంగా ఉంది. | అందుచే దుర్యోధనుడు భంగపడ్డాడు. | ఇక పాండవులు అడవుల పాలయ్యేరు. విరాటుని దాసులై దాక్కున్నారు తామరతంపరగా కలకలలాడుతూ ఉన్నవారి సంసారానికి వంశ ఉత్తరా గర్భం తప్పవేరేమి లేకుండా పోయింది.............© 2017,www.logili.com All Rights Reserved.