జ్యోతిష్య - వాస్తు - సంఖ్యా శాస్త్రాలరీత్యా నిత్యజీవితంలో వర్ణమయ ప్రపంచం గురించి 'రంగులు' మీతో మాట్లాడతాయి. రంగుల భాషను అక్షరాలలో మార్చి మీకందించిన ఈ గ్రంథం ప్రపంచంలోనే ఈ మూడు శాస్త్రాల సమ్మేళనంతో అందించిన మొట్టమొదట గ్రంథం. దీనిలో చర్చించనిదంటూ ఏదీలేదు. ఇందులో లేనిది మీరు రంగుటద్దాలు ధరించి గాలించినా ఎక్కడా దొరకదు.
మీతో అచ్చ తెలుగు భాషలో రంగులతో మాట్లాడించే పుస్తకం ఈ "కలర్స్ - జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రం".
మన నిత్య జీవితంలో మన చుట్టూనే ఉంటూ మనకి తెలియకుండా మనపై అత్యంత ప్రభావాన్ని చూపించేవి కలర్స్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు ఈ కలర్స్ మీద పరిశోధనలు సాగిస్తున్నారు. భారతీయులు మాత్రం ఎన్నో వేల ఏళ్ల క్రితమే సృష్టిలో ఉన్న అనేక రంగులు మానవుడిపై ప్రభావం చూపిస్తాయని తెలుసుకున్నారు. ఆ విధంగానే ప్రతి గ్రహానికి ఒక రత్నాన్ని ఎంపిక చేసారు.
ఈ 'కలరాలజీ' అన్నది ప్రపంచానికి మొదటగా పరిచయం చేసింది భారతీయులు అన్న వాస్తవం అందరూ ఒప్పుకుని తీరవలసింది. ఆదాయం పెరగటానికి, రుణ, శతృబాధలు తీరడానికి, సంతానవృద్ధి, గృహనిర్మాణం, కుటుంబ సౌఖ్యం, దాంపత్య సౌఖ్యం, రోగనాశనం ఇలా మానవ జీవితంలో ఉండే అనేక సమస్యలకు కలరాలజీలో చక్కని పరిష్కారాలున్నాయి.
'కలరాలజీ' అన్న పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా వాహనాలకు, వ్యాపార సంస్థలకు వేసే రంగులకు చూస్తుంటారు. అలాగే కొన్ని దేశాలలో దుస్తులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంటారు. వివాహ సమయంలో నలుపు లేదా ఎరుపు రంగుల దుస్తులు ధరిస్తే త్వరలోనే ఆచార్య లేక భర్త ప్రమాదం పాలుకావటం లేదా రోగగ్రస్తులు కావటం జరుగుతుందని విశ్వాసం కొన్ని దేశాల్లో కన్పిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎరుపును ప్రమాదసూచికగా, తెలుపును ప్రశాంతతకు, ఆకుపచ్చను నిర్భయత్వానికి, నలుపును విషాదానికి సంకేతంగా ఉపయోగిస్తుంటారు. ఆయా రంగులు మన మనసుపై అటువంటి ప్రభావాన్ని లేదా భావాన్ని చుపిస్తాయన్నది పరిశోదనాత్మకంగా నిరూపితమైన విషయం.
ఈ రంగులు మన జీవితంలో చేసే మాయా జాలాలను తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ఆసాంతం చదవాల్సిందే. ఈ పుస్తకం మీ ఆదరాభిమానాలు పొందుతుందని..... మీ జీవితంలో ఓ క్రొత్త మార్పును తెస్తుందని ఆశిస్తున్నాము.
- ఆదిపూడి వెంకట శివసాయిరామ్
జ్యోతిష్య - వాస్తు - సంఖ్యా శాస్త్రాలరీత్యా నిత్యజీవితంలో వర్ణమయ ప్రపంచం గురించి 'రంగులు' మీతో మాట్లాడతాయి. రంగుల భాషను అక్షరాలలో మార్చి మీకందించిన ఈ గ్రంథం ప్రపంచంలోనే ఈ మూడు శాస్త్రాల సమ్మేళనంతో అందించిన మొట్టమొదట గ్రంథం. దీనిలో చర్చించనిదంటూ ఏదీలేదు. ఇందులో లేనిది మీరు రంగుటద్దాలు ధరించి గాలించినా ఎక్కడా దొరకదు. మీతో అచ్చ తెలుగు భాషలో రంగులతో మాట్లాడించే పుస్తకం ఈ "కలర్స్ - జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రం". మన నిత్య జీవితంలో మన చుట్టూనే ఉంటూ మనకి తెలియకుండా మనపై అత్యంత ప్రభావాన్ని చూపించేవి కలర్స్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు ఈ కలర్స్ మీద పరిశోధనలు సాగిస్తున్నారు. భారతీయులు మాత్రం ఎన్నో వేల ఏళ్ల క్రితమే సృష్టిలో ఉన్న అనేక రంగులు మానవుడిపై ప్రభావం చూపిస్తాయని తెలుసుకున్నారు. ఆ విధంగానే ప్రతి గ్రహానికి ఒక రత్నాన్ని ఎంపిక చేసారు. ఈ 'కలరాలజీ' అన్నది ప్రపంచానికి మొదటగా పరిచయం చేసింది భారతీయులు అన్న వాస్తవం అందరూ ఒప్పుకుని తీరవలసింది. ఆదాయం పెరగటానికి, రుణ, శతృబాధలు తీరడానికి, సంతానవృద్ధి, గృహనిర్మాణం, కుటుంబ సౌఖ్యం, దాంపత్య సౌఖ్యం, రోగనాశనం ఇలా మానవ జీవితంలో ఉండే అనేక సమస్యలకు కలరాలజీలో చక్కని పరిష్కారాలున్నాయి. 'కలరాలజీ' అన్న పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా వాహనాలకు, వ్యాపార సంస్థలకు వేసే రంగులకు చూస్తుంటారు. అలాగే కొన్ని దేశాలలో దుస్తులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంటారు. వివాహ సమయంలో నలుపు లేదా ఎరుపు రంగుల దుస్తులు ధరిస్తే త్వరలోనే ఆచార్య లేక భర్త ప్రమాదం పాలుకావటం లేదా రోగగ్రస్తులు కావటం జరుగుతుందని విశ్వాసం కొన్ని దేశాల్లో కన్పిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎరుపును ప్రమాదసూచికగా, తెలుపును ప్రశాంతతకు, ఆకుపచ్చను నిర్భయత్వానికి, నలుపును విషాదానికి సంకేతంగా ఉపయోగిస్తుంటారు. ఆయా రంగులు మన మనసుపై అటువంటి ప్రభావాన్ని లేదా భావాన్ని చుపిస్తాయన్నది పరిశోదనాత్మకంగా నిరూపితమైన విషయం. ఈ రంగులు మన జీవితంలో చేసే మాయా జాలాలను తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ఆసాంతం చదవాల్సిందే. ఈ పుస్తకం మీ ఆదరాభిమానాలు పొందుతుందని..... మీ జీవితంలో ఓ క్రొత్త మార్పును తెస్తుందని ఆశిస్తున్నాము. - ఆదిపూడి వెంకట శివసాయిరామ్© 2017,www.logili.com All Rights Reserved.