శ్రీ ఇవటూరి మూర్తిరాజు శర్మ శ్రీ ఇవటూరి రామకృష్ణ గార్లచే రాయబడిన "జాతకఫల మణిమంజరి" చాలా పురాతన గ్రంథము. గురు ముఖఃతా జాతకము వేసే విధానము నేర్చుకుని జాతకములను విచారణ చేసే విధానమున్న పూర్వరోజులలో కొంత స్వయం ప్రజ్ఞతో నేర్చుకోవాలనుకునే వారికి సహాయకారి ఈ జాతకఫల మణిమంజరి. ఈ గ్రంథమంతా ప్రశ్నలు సమాధానముల రూపంలో ఉండడం గమనించవచ్చును.
ఇందులోని విషయాన్ని పరిశీలిస్తే ఇది గుచ్ఛములుగా విభజించబడిన గ్రంథము. ప్రథమ గుచ్ఛము 162 వ పేజీ వరకు ప్రాథమిక విషయాలు అత్యంత ముఖ్యమైన విషయములైన జ్యోతిషశాస్త్ర మంటే ఏమిటి? అనే ప్రశ్నతో ప్రారంభమయ్యి జ్యోతిష్కుని లక్షణాలు, జ్యోతిష్కులు తెలుసుకోవలసిన అనేక ప్రాథమిక విషయాలను చక్కగా పరిచయం చేశారు. ఇక తరువాత పుటలలో నక్షత్రాలు, వాటికి చెప్పబడిన వివిధ కారకత్వములు, లగ్నములు కారకత్వములు, వివిధ లగ్నములు కనుక్కునే విధానము, రాశీ కారకత్వములు, షోడషవర్గులు, ఆయుర్దాయ సాధన మారకుల లక్షణములు, బాలారిష్టములు పుడుతూనే మాతాశిశువులు వేరువేరుగా లేదా కలసి మరణించడానికి గల కారణములను వివరంగా తెలియజేయడం జరిగింది.
- శ్రీ ఇవటూరి మూర్తిరాజు శర్మ