అతి ప్రాచీనములయిన కొన్ని జ్యోతిషగ్రంథములను చదివినప్పుడు ఈ శాస్త్రము అనంతము అని అన్పించకమానదు. మహామహులు రచించిన గ్రంథములయందు నిభిడీకృతమయిన అనేక రహస్యములను తెలుసుకొనుటకు ఒక జన్మ చాలదనిపిస్తుంది. ఈ శాస్త్రము అతి ప్రాచీనమయిన భారతీయ స్వంతమైన విజ్ఞాన శాస్త్రము. ఈ శాస్త్రము వేదములయందు ఇమిడి ఉన్నదే. ఈ శాస్త్రము ఆదినుండియూ వివిధ శాఖలుగా విస్తరించి, అనేక విషయములను దేశహితములను తెలియజేయుటకు ఒక ఉపకరణముగానున్నది.
ఆకసమునందు విహరించు గ్రహముల, నక్షత్రముల, సంచార విషయములను సమూలాగ్రముగా తెలియజేయునది సిద్ధాంతము. గ్రహములు, నక్షత్రముల యొక్క కిరణ ప్రభావము వలన భూమిపైనున్న ప్రాణులకు కలుగబోయే శుభాశుభములను తెలియజేయు భాగమే జాతక భాగము. ఈ భూమిపై పాలకుల గూర్చి, ముందు కలుగబోవు ఉపద్రవములను, వర్షాభావములను గూర్చి, వాతావరణమును గూర్చి, సస్యావృద్ధి క్షయములను గూర్చి, భూకంపనములను మొదలగు వాటిని గూర్చి తెలియజేయు శాస్త్రము సంహితజ్యోతిషమనబడును. ఈ మూడు భాగములు కలిసి పూర్ణజ్యోతిషశాస్త్రముగా తెలియవలయును.
అతి ప్రాచీనములయిన కొన్ని జ్యోతిషగ్రంథములను చదివినప్పుడు ఈ శాస్త్రము అనంతము అని అన్పించకమానదు. మహామహులు రచించిన గ్రంథములయందు నిభిడీకృతమయిన అనేక రహస్యములను తెలుసుకొనుటకు ఒక జన్మ చాలదనిపిస్తుంది. ఈ శాస్త్రము అతి ప్రాచీనమయిన భారతీయ స్వంతమైన విజ్ఞాన శాస్త్రము. ఈ శాస్త్రము వేదములయందు ఇమిడి ఉన్నదే. ఈ శాస్త్రము ఆదినుండియూ వివిధ శాఖలుగా విస్తరించి, అనేక విషయములను దేశహితములను తెలియజేయుటకు ఒక ఉపకరణముగానున్నది. ఆకసమునందు విహరించు గ్రహముల, నక్షత్రముల, సంచార విషయములను సమూలాగ్రముగా తెలియజేయునది సిద్ధాంతము. గ్రహములు, నక్షత్రముల యొక్క కిరణ ప్రభావము వలన భూమిపైనున్న ప్రాణులకు కలుగబోయే శుభాశుభములను తెలియజేయు భాగమే జాతక భాగము. ఈ భూమిపై పాలకుల గూర్చి, ముందు కలుగబోవు ఉపద్రవములను, వర్షాభావములను గూర్చి, వాతావరణమును గూర్చి, సస్యావృద్ధి క్షయములను గూర్చి, భూకంపనములను మొదలగు వాటిని గూర్చి తెలియజేయు శాస్త్రము సంహితజ్యోతిషమనబడును. ఈ మూడు భాగములు కలిసి పూర్ణజ్యోతిషశాస్త్రముగా తెలియవలయును.© 2017,www.logili.com All Rights Reserved.