ఈ జోతిష్య శాస్త్రము అనంతమైనది. అద్వితీయమైనది. ఈ శాస్త్రమునందు అందరికి అభిరుచి కలుగచేయుటకై సరళమైన భాషలో వ్రాయుటకు పూనుకొంటిని. ఇది మొదటనే మూడు భాగములుగా వ్రాయు సంకల్పించితిని. ఈ మూడవ భాగములో స్త్రీ జాతక విధానమును గూర్చి వ్రాయ తలంచితిని. కానీ ఈ భాగమును మున్ముందు ఇంకా వివరణ చేయు ఆలోచన కలిగియుంటిని. అందువలన అమ్మవారి (అమ్మణ్ణి) అనుగ్రహమును, పెద్దల ఆశీస్సులను కోరుకొనుచు యీ చిరుగ్రంథమును తెలుగువారి కారకమలముల నలంకరించవలెనని కోరుకొనుచున్నాను.
అనంత మహిమాన్విత సంపన్నురాలైన లోకమాత చందలూరు మహాలక్ష్మి (అమ్మణ్ణి) అమ్మవారి పల్లవరుణ పదయుగళం నా అంతరంగమంతా నిండియుండటం నా అదృష్టం. నా అణువణువున ఆ తల్లి భావనయే యుండుట వలననే నా రచనకు జీవం పోసింది. నా యీ కృతి సుకృతి కావటానికి ఆయమ్మ చల్లని కటాక్షమే కారణం కావటం చేత నా గుండె నిండా నిండిన బత్తితో అమ్మ పాదరావింద సన్నిధిని సాష్టాoగా నమస్కృతి పురస్సరంగా ఈ కృతిని అంకితమిస్తున్నాను.
- ముళ్ళపూడి లీలాకృష్ణమూర్తి