శ్లో. సిద్ధిః సాధ్యా సతామస్తు ప్రసాదాత్తస్య ధూర్జటే:,
జాహ్నవీ ఫేనలేఖేవ యన్మూర్ని శశినః కలా.
తా. శిరమున గంగాతరంగాలనురుగువలె ఉండే చంద్రకళచే శోభిల్లే
పరమేశ్వరుని కరుణచే సజ్జనులకు అభీష్టసిద్ధి గల్గుగాక.
శ్లో. శ్రుతో హితోపదేశో యం పాటవం సంస్కృతోక్తిషు,
వాచాం సర్వత్ర వైచిత్ర్యం నీతివిద్యాం దదాతి చ.2
తా. ఈ “హితోపదేశం” అనే గ్రంథాన్ని చదివినచో సంస్కృతభాషాసూక్తులందు నేర్పూ, అన్నియెడల వాక్కులలోని వైచిత్ర్యం, నీతిజ్ఞానం అలవడును.
(శ్రుతః= అధీతః, గురుముఖతః శ్రావణప్రత్యక్షవిషయీకృత ఇతి భావః)
3. విద్యాప్రశంస
శ్లో. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థఞ్బ సాధయేత్,
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
తా. బుద్ధిమంతుడు “ముసలితనం, చావు తనకు లేవు" అని తలంచి ధనాన్ని, విద్యను సంపాదించవలెను. ఇక మృత్యువుచే జుట్టు పట్టుబడినవాడువలె ధర్మమును ఆచరించవలయును.................
© 2017,www.logili.com All Rights Reserved.