అన్నీ తెలిసిన వాడు లేడు.... ఏమి తెలియని వాడు లేడు.... ఇది ఓ తెలుగు సామెత. వాస్తు శాస్త్రానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఇదే.
విజ్ఞానం ఎప్పుడు ఉన్నఫలంగా రాదు. నేటి ఆధునిక ఇంజినీరింగ్ వృక్షానికి ప్రాచీనకాలంలోనే బీజాలు పడ్డాయని ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రాచీన వాస్తుశాస్త్రంలో నిర్మాణానికి సంబంధించి వివరించిన సాంకేతిక విషయాలు, నియమాలు, నిబంధనలు ప్రస్తుతకాలంలోని ఇంజినీరింగ్ విషయాలకు, ప్రభుత్వ నియమాలకు సారూప్యత కనిపిస్తుంది. గృహనిర్మాణానికి సంబంధించి "వాస్తు నియమాలు అయినా ప్రభుత్వనియమాలు అయినా వాటి ఉద్దేశం మాత్రం ఒకటే.
అది దృఢమైన,గాలి వెలుతురు ధారాళంగా వచ్చేట్లు, ఇరుగు పొరుగువారికి ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా ఇల్లు నిర్మించుకోవటం. వాస్తుశాస్త్రం ఇంటిని నిర్మించుకోవడానికి ఉపయోగపడే శాస్త్రం. ఇల్లు కూలగొట్టుకోవడానికి వాడే శాస్త్రం కాదు. కావున అన్ని రకాలుగా ఆలోచించి వాస్తుశాస్త్ర ప్రకారం గృహ నిర్మాణం చేసుకోవాలి.
- ఇటికాల భాస్కర్
అన్నీ తెలిసిన వాడు లేడు.... ఏమి తెలియని వాడు లేడు.... ఇది ఓ తెలుగు సామెత. వాస్తు శాస్త్రానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఇదే. విజ్ఞానం ఎప్పుడు ఉన్నఫలంగా రాదు. నేటి ఆధునిక ఇంజినీరింగ్ వృక్షానికి ప్రాచీనకాలంలోనే బీజాలు పడ్డాయని ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రాచీన వాస్తుశాస్త్రంలో నిర్మాణానికి సంబంధించి వివరించిన సాంకేతిక విషయాలు, నియమాలు, నిబంధనలు ప్రస్తుతకాలంలోని ఇంజినీరింగ్ విషయాలకు, ప్రభుత్వ నియమాలకు సారూప్యత కనిపిస్తుంది. గృహనిర్మాణానికి సంబంధించి "వాస్తు నియమాలు అయినా ప్రభుత్వనియమాలు అయినా వాటి ఉద్దేశం మాత్రం ఒకటే. అది దృఢమైన,గాలి వెలుతురు ధారాళంగా వచ్చేట్లు, ఇరుగు పొరుగువారికి ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా ఇల్లు నిర్మించుకోవటం. వాస్తుశాస్త్రం ఇంటిని నిర్మించుకోవడానికి ఉపయోగపడే శాస్త్రం. ఇల్లు కూలగొట్టుకోవడానికి వాడే శాస్త్రం కాదు. కావున అన్ని రకాలుగా ఆలోచించి వాస్తుశాస్త్ర ప్రకారం గృహ నిర్మాణం చేసుకోవాలి. - ఇటికాల భాస్కర్© 2017,www.logili.com All Rights Reserved.