కాలక్రమములో సమస్త సృష్టియు, బలహీనం పొందినట్లే. మానవుల బుద్ధికూడా సన్నగిల్లింది. అందుచే విశేషముగా ఇది చెప్పినాను. మానవులగువారికి గ్రహింపరాని దగుచు విసుగు పుట్టించునదిగా నుండునను భావముతో ఈ ప్రాచీన ఆయుర్వేద చికిత్సా విధానమును గ్రంథమున ప్రతి విషయము విపులముగా గాక గుదించి వ్రాయుచున్నాను. ఆరోగ్యము సంపూర్ణముగా మానవుడు పొందవలెనన్నచో బ్రాహ్మీముహూర్తమున ప్రతినిత్యమూ వేళ తప్పకుండా ఒకరిచే లేపబడక తనకు తానుగా లేవగల శక్తి అలవరచుకొని ఆప్రకారము లేచును, కాలకృత్యములు నెరవేర్చుకొని, నవరంధ్రములను జలముచే శుభ్రముగా కడుగుకొని పిదప శిరస్నానము చేసిన నరునికి సర్వశుభములను సిద్ధించును. ఈయనంతరము దైవధ్యానము సలుపుట మంగళకరమగు మంచి వస్తువులను దర్శించుట మంచిది. అని శాస్త్రకారులు చెప్పియున్నారు.
ఆహారక్రమము కూడా ఒక పధ్ధతిని అనుసరించే ఉండవలెను. ఎవరి జీర్ణకోశమును వారు నాలుగు భాగములు గావించుకొని, అందు మూడు భాగములను సర్వ పదార్థముల చేతను నింపి మిగిలిన మాయొకభాగము కాళీగా ఉంచవలెను. ఎందుకిట్లు చేయుటయున్నచో ఈ శరీరమును సక్రమముగా తిప్పి నడిపించుటకు మనుజుని పాదాంగుష్టము మొదలు ముక్కు చివరి భాగము వరకు ఏడు వందల ప్రధాన నాడులందును వాయువు కింది నుండి పైకి పై నుండి కిందకి తిరుగుటకు మార్గావరోధములు లేకుండుటకు ఆ విధముగా ఆహారము తిన్నచో ఆరోగ్యము ఉత్తమగతి నుండగలదు.
- చక్రవర్తుల పద్మనాభశాస్త్రి
కాలక్రమములో సమస్త సృష్టియు, బలహీనం పొందినట్లే. మానవుల బుద్ధికూడా సన్నగిల్లింది. అందుచే విశేషముగా ఇది చెప్పినాను. మానవులగువారికి గ్రహింపరాని దగుచు విసుగు పుట్టించునదిగా నుండునను భావముతో ఈ ప్రాచీన ఆయుర్వేద చికిత్సా విధానమును గ్రంథమున ప్రతి విషయము విపులముగా గాక గుదించి వ్రాయుచున్నాను. ఆరోగ్యము సంపూర్ణముగా మానవుడు పొందవలెనన్నచో బ్రాహ్మీముహూర్తమున ప్రతినిత్యమూ వేళ తప్పకుండా ఒకరిచే లేపబడక తనకు తానుగా లేవగల శక్తి అలవరచుకొని ఆప్రకారము లేచును, కాలకృత్యములు నెరవేర్చుకొని, నవరంధ్రములను జలముచే శుభ్రముగా కడుగుకొని పిదప శిరస్నానము చేసిన నరునికి సర్వశుభములను సిద్ధించును. ఈయనంతరము దైవధ్యానము సలుపుట మంగళకరమగు మంచి వస్తువులను దర్శించుట మంచిది. అని శాస్త్రకారులు చెప్పియున్నారు. ఆహారక్రమము కూడా ఒక పధ్ధతిని అనుసరించే ఉండవలెను. ఎవరి జీర్ణకోశమును వారు నాలుగు భాగములు గావించుకొని, అందు మూడు భాగములను సర్వ పదార్థముల చేతను నింపి మిగిలిన మాయొకభాగము కాళీగా ఉంచవలెను. ఎందుకిట్లు చేయుటయున్నచో ఈ శరీరమును సక్రమముగా తిప్పి నడిపించుటకు మనుజుని పాదాంగుష్టము మొదలు ముక్కు చివరి భాగము వరకు ఏడు వందల ప్రధాన నాడులందును వాయువు కింది నుండి పైకి పై నుండి కిందకి తిరుగుటకు మార్గావరోధములు లేకుండుటకు ఆ విధముగా ఆహారము తిన్నచో ఆరోగ్యము ఉత్తమగతి నుండగలదు. - చక్రవర్తుల పద్మనాభశాస్త్రిHi Pls Let me know if this book is available
© 2017,www.logili.com All Rights Reserved.