ఈ పుస్తకం కోసం నేను ఎంతో సమయాన్ని కేటాయించాను. రాయటానికి కాదు. సేకరించుకోవటానికి, తెలుసుకోవడానికి. ఇదంతా చేసింది నా రచనా వ్యాసంగంలో భాగమయినప్పటికీ కొంత సోషల్ కమిట్ మెంట్ ఉంది. అందంగా ఉండమంటే ఆరోగ్యంగా ఉన్నట్టే. ఆరోగ్యంగా ఉంటేనే ఏదయినా చేయగలం. స్పేస్ ఉమెన్ సునీత విలియమ్స్ లా నింగికెగరగలుగుతారు. సానియామీర్జా, కోనేరు హంపి, కిరణ్ బేడీలా మీ ఆశయాలకి మీ ఇష్టాలకి తగ్గట్టు మీ పిల్లలని తయారుచెయ్యగలుగుతారు.
మేధాపాట్కర్ లా సామాజిక సేవ చేయగలరు. స్మితలా టాప్ సింగర్ అవ్వగాలుగుతారు. శోభానలా డాన్స్ లో పద్మశ్రీ తీసుకోగలుగుతారు. ఇంకా ఎందరో ఎందరిలానో, సంగీతంలో, సాహిత్యంలో, క్రికెట్ లో, కళల్లో, వ్యాపారసామ్రాజ్యంలో, ఎందులోనైనా సరే రాణించాలంటే, అందంపై కేర్ తీసుకోవాలి. అందమంటే ఆత్మవిశ్వాసం... దేన్నయినా చెయ్యగలమనే నమ్మకం... వందకి వంద శాతం ఆరోగ్యము.
- మీ మైథిలీ వెంకటేశ్వరరావు
ఈ పుస్తకం కోసం నేను ఎంతో సమయాన్ని కేటాయించాను. రాయటానికి కాదు. సేకరించుకోవటానికి, తెలుసుకోవడానికి. ఇదంతా చేసింది నా రచనా వ్యాసంగంలో భాగమయినప్పటికీ కొంత సోషల్ కమిట్ మెంట్ ఉంది. అందంగా ఉండమంటే ఆరోగ్యంగా ఉన్నట్టే. ఆరోగ్యంగా ఉంటేనే ఏదయినా చేయగలం. స్పేస్ ఉమెన్ సునీత విలియమ్స్ లా నింగికెగరగలుగుతారు. సానియామీర్జా, కోనేరు హంపి, కిరణ్ బేడీలా మీ ఆశయాలకి మీ ఇష్టాలకి తగ్గట్టు మీ పిల్లలని తయారుచెయ్యగలుగుతారు. మేధాపాట్కర్ లా సామాజిక సేవ చేయగలరు. స్మితలా టాప్ సింగర్ అవ్వగాలుగుతారు. శోభానలా డాన్స్ లో పద్మశ్రీ తీసుకోగలుగుతారు. ఇంకా ఎందరో ఎందరిలానో, సంగీతంలో, సాహిత్యంలో, క్రికెట్ లో, కళల్లో, వ్యాపారసామ్రాజ్యంలో, ఎందులోనైనా సరే రాణించాలంటే, అందంపై కేర్ తీసుకోవాలి. అందమంటే ఆత్మవిశ్వాసం... దేన్నయినా చెయ్యగలమనే నమ్మకం... వందకి వంద శాతం ఆరోగ్యము. - మీ మైథిలీ వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.