రాగం: మధ్యమావతి
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము||
అదివెంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కు డానందమయము||
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము||
కైవల్యపదము వెంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపదరూప మదివో
పావనములకెల్ల పావనమయము||
ఇటువంటి ఎన్నో అన్నమయ్య కీర్తనలు ఈ పుస్తకంలో కలవు..
రాగం: మధ్యమావతి అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము|| అదివెంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిల మునులకు అదె చూడుడదె మ్రొక్కు డానందమయము|| చెంగట నల్లదివో శేషాచలము నింగి నున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము|| కైవల్యపదము వెంకటనగ మదివో శ్రీ వేంకటపతికి సిరులైనది భావింప సకల సంపదరూప మదివో పావనములకెల్ల పావనమయము|| ఇటువంటి ఎన్నో అన్నమయ్య కీర్తనలు ఈ పుస్తకంలో కలవు..© 2017,www.logili.com All Rights Reserved.