వేద వాజ్మయంలో ఉపనిషత్తులు వేదాలకు చివర - సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాల తరువాత వస్తాయి. అందుకే వీటిని వేదాంతం అని కూడా అంటారు. భారతీయ తత్త్వచింతన సమస్తం ఉపనిషత్తుల నుంచే వచ్చింది. వాటి ప్రభావం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దానిపై ఉంది. అందుచేత స్థూలంగా భారతీయ చితన సమస్తానికి వేదాంతం అనే మరోపేరు వచ్చింది.
ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది. ఎలా వచ్చింది? దీని సృష్టికర్త ఎవరు? జగత్తు స్వభావము ఏమిటి? అందులో మానవుని పాత్ర ఏమిటి? మానవుడు ఎక్కడ నుండి ఎలా, ఎందుకు వచ్చాడు? మరణించిన తరువాత ఎక్కడికి పోతాడు? తిరిగి జన్మిస్తాడా? మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఇటువంటి మౌలిక ప్రశ్నలు వేసుకుని ఉపనిషత్కారులు తమ ధ్యాన వివేచన ఫలితంగా కనుగొన్న, తాము దర్శించిన, తాము స్వయంగా అనుభూతిలోకి తెచ్చుకున్న, సమాధాన సత్యాలను వివరించడానికి, ఇతరులకు బోధించడానికి ప్రయత్నించారు. ఆ మహర్షుల ప్రయత్న ఫలితమే ఉపనిషత్తులు.
వేద వాజ్మయంలో ఉపనిషత్తులు వేదాలకు చివర - సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాల తరువాత వస్తాయి. అందుకే వీటిని వేదాంతం అని కూడా అంటారు. భారతీయ తత్త్వచింతన సమస్తం ఉపనిషత్తుల నుంచే వచ్చింది. వాటి ప్రభావం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దానిపై ఉంది. అందుచేత స్థూలంగా భారతీయ చితన సమస్తానికి వేదాంతం అనే మరోపేరు వచ్చింది. ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది. ఎలా వచ్చింది? దీని సృష్టికర్త ఎవరు? జగత్తు స్వభావము ఏమిటి? అందులో మానవుని పాత్ర ఏమిటి? మానవుడు ఎక్కడ నుండి ఎలా, ఎందుకు వచ్చాడు? మరణించిన తరువాత ఎక్కడికి పోతాడు? తిరిగి జన్మిస్తాడా? మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఇటువంటి మౌలిక ప్రశ్నలు వేసుకుని ఉపనిషత్కారులు తమ ధ్యాన వివేచన ఫలితంగా కనుగొన్న, తాము దర్శించిన, తాము స్వయంగా అనుభూతిలోకి తెచ్చుకున్న, సమాధాన సత్యాలను వివరించడానికి, ఇతరులకు బోధించడానికి ప్రయత్నించారు. ఆ మహర్షుల ప్రయత్న ఫలితమే ఉపనిషత్తులు.© 2017,www.logili.com All Rights Reserved.