పండిత శ్రీ సామవేదం రామమూర్తి శర్మగారిచే రచింపబడిన “భగమములు దండకమాల"ను పూర్తిగా చదివి, చాల ఆనందించితిని. పాండిత్య ప్రకర్షయే ప్రధాన లక్ష్యముగా పెట్టుకొనియుండినచో ఈ రచనము సంకల్పసిద్ధికి చాలదూరమై పోయియుండెడిది. సామాన్య ప్రజాకోటికాకర్షణీయమొనర్చి సర్వపాపహరమగు భగవన్నామమును ప్రతీనోటను అత్యంత సులభముగ ఉచ్ఛరింపజేయుటయే ఈ రచయిత సంకల్పమని స్పష్టముగ గోచరించుచున్నది.
ఆంధ్రభాషయందు దండకములకు కొరత లేదు. బహుముఖమైన భగవత్స్వరూప మును, బహు నామములతో సంకీర్తనమొనర్చు దండకములు వందలకొలది కలవు. కాని సామాన్య ప్రజలనోట వినవచ్చుచున్నవి మాత్రము అతిస్వల్ప సంఖ్యాకములై యున్నవి. భాషాపటిష్ఠత మూలమున సామాన్యులకందరాని ప్రశస్త దండకములను మూలబడియున్నవి.
గేయప్రాయముగనుండు దండకములు సాధ్యమైనంత సులు శైలిలోనున్నప్పుడే భక్త్యావేశమును సామాన్య ప్రజలయందు రేకెత్తింపగలదు. రహస్యమును గుర్తించి కేవల నామసంకీర్తనమే లక్షముగా గ్రహించి శర్మగారు ఈ దండకములను రచించి కృతకృత్యులైరి. వారి సంకల్పమెంతయు ప్రశంసాపాత్రము. ఇంకను రామమూర్తి శర్మగారు జనసంఘములందు భక్తిబీజములకు దానం యని కోరుచున్నాను.
పండిత శ్రీ సామవేదం రామమూర్తి శర్మగారిచే రచింపబడిన “భగమములు దండకమాల"ను పూర్తిగా చదివి, చాల ఆనందించితిని. పాండిత్య ప్రకర్షయే ప్రధాన లక్ష్యముగా పెట్టుకొనియుండినచో ఈ రచనము సంకల్పసిద్ధికి చాలదూరమై పోయియుండెడిది. సామాన్య ప్రజాకోటికాకర్షణీయమొనర్చి సర్వపాపహరమగు భగవన్నామమును ప్రతీనోటను అత్యంత సులభముగ ఉచ్ఛరింపజేయుటయే ఈ రచయిత సంకల్పమని స్పష్టముగ గోచరించుచున్నది. ఆంధ్రభాషయందు దండకములకు కొరత లేదు. బహుముఖమైన భగవత్స్వరూప మును, బహు నామములతో సంకీర్తనమొనర్చు దండకములు వందలకొలది కలవు. కాని సామాన్య ప్రజలనోట వినవచ్చుచున్నవి మాత్రము అతిస్వల్ప సంఖ్యాకములై యున్నవి. భాషాపటిష్ఠత మూలమున సామాన్యులకందరాని ప్రశస్త దండకములను మూలబడియున్నవి. గేయప్రాయముగనుండు దండకములు సాధ్యమైనంత సులు శైలిలోనున్నప్పుడే భక్త్యావేశమును సామాన్య ప్రజలయందు రేకెత్తింపగలదు. రహస్యమును గుర్తించి కేవల నామసంకీర్తనమే లక్షముగా గ్రహించి శర్మగారు ఈ దండకములను రచించి కృతకృత్యులైరి. వారి సంకల్పమెంతయు ప్రశంసాపాత్రము. ఇంకను రామమూర్తి శర్మగారు జనసంఘములందు భక్తిబీజములకు దానం యని కోరుచున్నాను.
© 2017,www.logili.com All Rights Reserved.