Title | Price | |
Siva Padam | Rs.150 | In Stock |
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి, సవ్యాఖ్యాన“శివపదం' గ్రంథం గురించి నాలుగు రాయాలి. నాపట్ల ఉన్న గౌరవంతో వార కోరారు. మనసులో ఉన్నమాట చెప్పాలంటే, రాయకఉండాలనిపించింది. కారణం, ఈ గ్రంథం నాకున్న మమకారం, ఎన్నివేల మాటల్లో చెప్పినా, చెప్పదలచుకున చెప్పలేనేమో అన్న శంక. అంతకుమించి, ఈ 'శివపదం' గురించి, ఒక ముక్కయినా చెప్పగల ఉపజ్ఞ నాకున్నదా అన్నగొంకు. కానీ, మమకారం నాచేత ఈ పని చేయిస్తోంది.
ఉన్మత్త పుష్పానికి, మారేడు దళానికి, 'మార్గావర్తిత పాదుక' 'గండూషాం బునిషేచనా'నికీ, కించిద్భక్షిత మాంస శేష కబలానికీ కూడా, భక్తి భావన కారణంగా, శిపదాంబుజార్చనార్హత కలగలేదా! 'బాంధవాశివ భక్తాశ్చ' కారణంగా శర్మగారికి బంధువును కాగలిగిన నాకు, ఈ శివపదాన్ని సమర్చించేందుకు ప్రేరణ కలిగింది. నా ఈ పదాలు, శివపదానురక్తి వల్ల యోగ్యతను పొందుతాయి. అదీగాక, ఇంత గొప్ప గ్రంథంలో ఓమూల చిన్న చోటు సంపాదించుకోవచ్చు అనే స్వార్థం కూడా. .
కైలాసాచలం వంటి అచంచలమైన భక్తి, పూర్వభవపుణ్య సంపాక సంచితమైన సహజ పాండితీప్రకర్ష ప్రత్యక్షంగా చూస్తేగానీ నమ్మశక్యంగాని స్ఫురణతో భాసించే సునిశితమేధాసంపత్తి, వేదవేదాంగ పురాణేతిహాసాల సారపరీ గ్రహణతో పరిపుష్టమైన వ్యుత్పత్తి, శివేతరక్షతమేగాక, శివోన్ముఖ మవడం కూడా కవనశక్తికి కర్తవ్యం అనే నమ్మిక, అన్నిటిని మించి, త్రికరణాత్మకమైన శివపదానురక్తి .... ఈ షణ్ముఖీనమైన సామవేదాలు వ్యక్తి ఈ 'శివపదం'.
వెయిన్నూట పదార్లు దాటిన శివకీర్తనలు విరచించి, ఇంకా దీక్షతో, రోజుకొకటి తక్కువ కాకుండా, శివార్పణంగా, తన భావనావల్లు -ఇలా ప్రశ్ని సన్నిభనాదం.
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి, సవ్యాఖ్యాన“శివపదం' గ్రంథం గురించి నాలుగు రాయాలి. నాపట్ల ఉన్న గౌరవంతో వార కోరారు. మనసులో ఉన్నమాట చెప్పాలంటే, రాయకఉండాలనిపించింది. కారణం, ఈ గ్రంథం నాకున్న మమకారం, ఎన్నివేల మాటల్లో చెప్పినా, చెప్పదలచుకున చెప్పలేనేమో అన్న శంక. అంతకుమించి, ఈ 'శివపదం' గురించి, ఒక ముక్కయినా చెప్పగల ఉపజ్ఞ నాకున్నదా అన్నగొంకు. కానీ, మమకారం నాచేత ఈ పని చేయిస్తోంది. ఉన్మత్త పుష్పానికి, మారేడు దళానికి, 'మార్గావర్తిత పాదుక' 'గండూషాం బునిషేచనా'నికీ, కించిద్భక్షిత మాంస శేష కబలానికీ కూడా, భక్తి భావన కారణంగా, శిపదాంబుజార్చనార్హత కలగలేదా! 'బాంధవాశివ భక్తాశ్చ' కారణంగా శర్మగారికి బంధువును కాగలిగిన నాకు, ఈ శివపదాన్ని సమర్చించేందుకు ప్రేరణ కలిగింది. నా ఈ పదాలు, శివపదానురక్తి వల్ల యోగ్యతను పొందుతాయి. అదీగాక, ఇంత గొప్ప గ్రంథంలో ఓమూల చిన్న చోటు సంపాదించుకోవచ్చు అనే స్వార్థం కూడా. . కైలాసాచలం వంటి అచంచలమైన భక్తి, పూర్వభవపుణ్య సంపాక సంచితమైన సహజ పాండితీప్రకర్ష ప్రత్యక్షంగా చూస్తేగానీ నమ్మశక్యంగాని స్ఫురణతో భాసించే సునిశితమేధాసంపత్తి, వేదవేదాంగ పురాణేతిహాసాల సారపరీ గ్రహణతో పరిపుష్టమైన వ్యుత్పత్తి, శివేతరక్షతమేగాక, శివోన్ముఖ మవడం కూడా కవనశక్తికి కర్తవ్యం అనే నమ్మిక, అన్నిటిని మించి, త్రికరణాత్మకమైన శివపదానురక్తి .... ఈ షణ్ముఖీనమైన సామవేదాలు వ్యక్తి ఈ 'శివపదం'. వెయిన్నూట పదార్లు దాటిన శివకీర్తనలు విరచించి, ఇంకా దీక్షతో, రోజుకొకటి తక్కువ కాకుండా, శివార్పణంగా, తన భావనావల్లు -ఇలా ప్రశ్ని సన్నిభనాదం.
© 2017,www.logili.com All Rights Reserved.