బ్రహ్మధర్మము ఒక అమూల్యమైన గ్రంథము. భాష ఉపనిషత్తులదయినను, అది యొక స్వతంత్ర గ్రంథము. దీనితో పోల్చదగినది బాదరాయణుని 'బ్రహ్మసూత్రము'లొక్కటే. బ్రహ్మసూత్రముల యుద్దేశము ఉపనిషదుపదేశములను సంగ్రహముగా వ్రాయుటయే. కాని మహర్షి దేవేంద్ర నాధుడు ఉపనిద్భాషను ఉపయోగించెను. ఒక స్వతంత్ర గ్రంథమునే రచించెను. ఆయన, అన్ని చోట్లను ఉపనిషద్భావములను మాత్రము తీసుకొనలేదు. కొన్ని ఉపనిషత్తులు పరస్పర విరుద్ధములుగా ఉన్నవి. ఒక్కొక్కప్పుడు ఒకే ఉపనిషత్తు యొక్క వివిధ భాగములు సహితము పరస్పరానుగుణ్యములుగా లేవు. మహర్షి దేవేంద్రనాధుని హృదయము నందు బ్రహ్మధర్మము యొక్క సంపూర్ణ ఆదర్శభావము ప్రతిఫలించుచుండెను. దానినే ఆయన ఉపనిషద్భాషలో వ్యక్తపరచెను.
బ్రహ్మధర్మము ఒక అమూల్యమైన గ్రంథము. భాష ఉపనిషత్తులదయినను, అది యొక స్వతంత్ర గ్రంథము. దీనితో పోల్చదగినది బాదరాయణుని 'బ్రహ్మసూత్రము'లొక్కటే. బ్రహ్మసూత్రముల యుద్దేశము ఉపనిషదుపదేశములను సంగ్రహముగా వ్రాయుటయే. కాని మహర్షి దేవేంద్ర నాధుడు ఉపనిద్భాషను ఉపయోగించెను. ఒక స్వతంత్ర గ్రంథమునే రచించెను. ఆయన, అన్ని చోట్లను ఉపనిషద్భావములను మాత్రము తీసుకొనలేదు. కొన్ని ఉపనిషత్తులు పరస్పర విరుద్ధములుగా ఉన్నవి. ఒక్కొక్కప్పుడు ఒకే ఉపనిషత్తు యొక్క వివిధ భాగములు సహితము పరస్పరానుగుణ్యములుగా లేవు. మహర్షి దేవేంద్రనాధుని హృదయము నందు బ్రహ్మధర్మము యొక్క సంపూర్ణ ఆదర్శభావము ప్రతిఫలించుచుండెను. దానినే ఆయన ఉపనిషద్భాషలో వ్యక్తపరచెను.© 2017,www.logili.com All Rights Reserved.