ఈ భూగోళం మీద మనిషి నిటారుగా నిలబడి నడచిన అద్భుత క్షణం మొదలు - శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆవిష్కరణల 'ఆరోహణ'ను సరళంగా, సోదాహరణంగా వివరిస్తాడు డా. బ్రోనొస్కి. ఈ పుస్తకంలోని విషయం మొదట బి బి సిలో ధారావాహికంగా వెలువడింది. ప్రపంచ వ్యాపితంగా అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొంది. తర్వాత పుస్తక రూపం ధరించింది. పుస్తకం వెలువడి కూడా నాలుగు దశాబ్దాలయిపోయింది. అయినా ఇంతటి ఘనమైన పుస్తకం ఇంతవరకూ మరొకటి వెలువడలేదు.
ఈయన పోలాండ్ లో జన్మించి ఇంగ్లాండ్ లో స్థిరపడ్డాడు. గణితశాస్త్ర అధ్యాపకుడిగా, జీవశాస్త్రవేత్తగా, శాస్త్ర చరిత్ర కారునిగా, రంగస్థలరచయితగా, కవిగా - అనేకానేక రంగాలలో ప్రజ్ఞాశాలిగా గౌరవం పొందాడు.
- ముక్తవరం పార్ధసారధి
ఈ భూగోళం మీద మనిషి నిటారుగా నిలబడి నడచిన అద్భుత క్షణం మొదలు - శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆవిష్కరణల 'ఆరోహణ'ను సరళంగా, సోదాహరణంగా వివరిస్తాడు డా. బ్రోనొస్కి. ఈ పుస్తకంలోని విషయం మొదట బి బి సిలో ధారావాహికంగా వెలువడింది. ప్రపంచ వ్యాపితంగా అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొంది. తర్వాత పుస్తక రూపం ధరించింది. పుస్తకం వెలువడి కూడా నాలుగు దశాబ్దాలయిపోయింది. అయినా ఇంతటి ఘనమైన పుస్తకం ఇంతవరకూ మరొకటి వెలువడలేదు. ఈయన పోలాండ్ లో జన్మించి ఇంగ్లాండ్ లో స్థిరపడ్డాడు. గణితశాస్త్ర అధ్యాపకుడిగా, జీవశాస్త్రవేత్తగా, శాస్త్ర చరిత్ర కారునిగా, రంగస్థలరచయితగా, కవిగా - అనేకానేక రంగాలలో ప్రజ్ఞాశాలిగా గౌరవం పొందాడు. - ముక్తవరం పార్ధసారధి© 2017,www.logili.com All Rights Reserved.