ఇది కలియుగం. ప్రతి జీవికి ఎదో ఒక కష్టం. ఎవ్వరికీ సమయం చాలదు. పూర్వం లాగా పూజలు చేయలేరు. గట్టిగా ప్రదక్షిణాలు చేయలేరు. డబ్బు ఖర్చు పెట్టలేరు. ఉపవాసాలు సరేసరి. ఎవ్వరిని చూసినా మనోధైర్యం లేనివారే. మరి ఈ జీవులను ఎలా రక్షించాలి? వీరికి దిక్కెవరు? అని నేనొక రోజంతా అమ్మను ధ్యానించాను. అమ్మ దర్శనం ఇచ్చింది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి నామానికి తేట తెలుగులో వివరణ ఇచ్చి, ఏ నామాన్ని ఎంత, ఎలా జపిస్తే ఏయే ఫలితాలు వస్తాయో లోకానికి అందించమని చిరునవ్వుముఖంతో ఆజ్ఞాపించింది. అదే సమయంలో 'భక్తి' టి.వి. వారు సాధనలో మంత్ర బలాన్ని గూర్చి చెప్పమని కోరగా, ఈ నామాలకు వివరణ, ప్రయోగం, ఫలితం గూర్చి వివరించేవాడిని.
వాటిని చూసి, విని ఎందరో తరించారు. ఈ నామ వ్యాఖ్యాన విశేషాలను "ఐశ్వర్యయోగ" నామంతో భక్తులకు అందించటానికి సంకల్పించాను. ఈ మంత్రాలు జపించి అందరూ ఇహపరాలు పొందండి. తొందరలో సహస్రానామాలూ ముద్రణకు నోచుకోవాలని అమ్మవారి అనుగ్రహం లభించాలని ఆశిస్తున్నాను.
- బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్
ఇది కలియుగం. ప్రతి జీవికి ఎదో ఒక కష్టం. ఎవ్వరికీ సమయం చాలదు. పూర్వం లాగా పూజలు చేయలేరు. గట్టిగా ప్రదక్షిణాలు చేయలేరు. డబ్బు ఖర్చు పెట్టలేరు. ఉపవాసాలు సరేసరి. ఎవ్వరిని చూసినా మనోధైర్యం లేనివారే. మరి ఈ జీవులను ఎలా రక్షించాలి? వీరికి దిక్కెవరు? అని నేనొక రోజంతా అమ్మను ధ్యానించాను. అమ్మ దర్శనం ఇచ్చింది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి నామానికి తేట తెలుగులో వివరణ ఇచ్చి, ఏ నామాన్ని ఎంత, ఎలా జపిస్తే ఏయే ఫలితాలు వస్తాయో లోకానికి అందించమని చిరునవ్వుముఖంతో ఆజ్ఞాపించింది. అదే సమయంలో 'భక్తి' టి.వి. వారు సాధనలో మంత్ర బలాన్ని గూర్చి చెప్పమని కోరగా, ఈ నామాలకు వివరణ, ప్రయోగం, ఫలితం గూర్చి వివరించేవాడిని. వాటిని చూసి, విని ఎందరో తరించారు. ఈ నామ వ్యాఖ్యాన విశేషాలను "ఐశ్వర్యయోగ" నామంతో భక్తులకు అందించటానికి సంకల్పించాను. ఈ మంత్రాలు జపించి అందరూ ఇహపరాలు పొందండి. తొందరలో సహస్రానామాలూ ముద్రణకు నోచుకోవాలని అమ్మవారి అనుగ్రహం లభించాలని ఆశిస్తున్నాను. - బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్© 2017,www.logili.com All Rights Reserved.