శ్రీ మహావిష్ణువుయొక్క అవతారములలో శ్రీరామావతారమె పూర్ణావతారామనుటలో అతిశయోక్తి లేదనుకుంటాను. శ్రీ రాముడు మానవ లోకానికి ఆదర్శపురుషుడు. పూర్ణ పురుషుడు. మొదటిసారిగా రామాయణము బ్రహ్మ అనుగ్రహముతో వాల్మీకి మహాముని వ్రాసినారు. ఆ తారువాత యెంతోమంది యెన్నోవిధాలు వ్రాసారు. కానీ, యీ రామచరిత్రలో వున్న గొప్పతనం యేమిటంటే, దీనిని ఎవరెలా వ్రాసినా పాడినా యెంతో వినసొంపుగానూ, యింపుగానూ వుంటుంది.
ఈ రామాయణము సమస్త లోకాలకు పూజనీయమైన పవిత్ర గ్రంథము. ఈ తరంలోని పిల్లలకొరకు సులభశైలిలో వచన కావ్యముగా ఎన్నో రామాయణములను వ్రాయుట జరుగుచున్నది. అటువంటి కృషిలో ఒక భాగమే బాలల బొమ్మల సంపూర్ణ రామాయణము కూడా. ఈ పవిత్ర గ్రంథాన్ని ప్రచురించదలచిన "శ్రీ గొల్లపూడి" వారు అభినందనీయులు.
పాఠక మహాశయులారా!